కర్ణాటక ముఖ్యమంత్రి పీఠముడి ఒక కొలిక్కి వచ్చింది.సిద్దరామయ్యకే( Siddaramaiah ) ముఖ్య మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం పచ్చ జెండా ఊపింది.
కర్ణాటకలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండే సమయం నుంచి ఇప్పుడు ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణమైన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్( DK Shivakumar ) ఈ పరిణామంతో నిరాశ ఎదురైనట్టుగా తెలుస్తుంది ….నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ని గెలిపించడానికి డీకే తన శాయ శక్తులా ప్రయత్నించారు.
పార్టీ వ్యూహాల క్రెడిట్ మొత్తం ఆయనదే.ఆర్థిక వనరుల దగ్గర నుంచి కార్యకర్తల సమన్వయం వరకు ఆయనే చూసుకున్నారని చెప్తారు .
మరి అలాంటి కీలక నేతని కూడా కాదని సిద్ధరామయ్యగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తే, డీకే శివకుమార్ పై వ్యక్తిగతంగాను, పార్టీ పరంగాను అనేక కేసులు ఉన్నాయి ముఖ్యంగా ఆయన సంస్థలలోని ఆర్థిక అవకతవకలపై అనేక కేసులను రిజిస్టర్ చేసిన పరిశోధనా సంస్థలు ఆయనను జైలులో పెట్టడానికి కాచుకుని కూర్చున్నాయి .ఆయన ను ముఖ్యమంత్రిని చేస్తే ఖచ్చితంగా అరెస్టు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం భయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.మరోవైపు సిద్ధ రామయ్య శాంత స్వభావి .ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల కోసం మైనారిటీల కోసం హిందూ వెనుకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.ఆయా వర్గాలలో ఆయనకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది .ఆయన అమలు చేసిన అహిందా ఫార్ములా కర్ణాటకలో చాలా ప్రచారానికి నోచుకుంది.ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేయకపోతే ఆయా వర్గాలను వచ్చే ఎన్నికలలో దూరం చేసుకోవాలన్న భయం కాంగ్రెస్ను వెన్నడినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా వయసు రీత్యా కూడా సీనియర్ అయిన సిద్ధరామయ్య ఇదే తనకు ఆఖరి ముఖ్యమంత్రి పదవి అంటూ సెంటిమెంటు రగిలించారు తద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావించిందట.https://telugustop.com/wp-content/uploads/2023/05/DK-Shivakumar-congress-rahul-gandhi-Siddaramaiah-CM-karnataka-karanataka-elections.jpg
అంతే కాకుండా రాహుల్ గాంధీ (Rahul Gandhi )కి సిద్ధరామయ్య మీద ప్రత్యేక అభిమానం ఉందని ,ఆయన పుట్టినరోజుకు వేడుకలకు స్వయం గా హాజరయ్యి ప్రత్యేకంగా ప్రసంగించిన విషయాన్ని కూడా ఇక్కడ కొందరు గుర్తు చేస్తున్నారు.డీకే పై సోనియాకు ప్రత్యేక అభిమానం ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న ఈ వ్యతిరేకతల దృష్టిలో పెట్టుకొని కష్టపడి సాధించిన విజయాన్ని పోగొట్టుకోకూడదన్న ముందు చూపుతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ….అయితే మొదటి రెండు సంవత్సరాలు సిద్ధ రామయ్యకు ముఖ్యమంత్రిని పదవి ఇచ్చి తర్వాత మూడు సంవత్సరాలు సిద్ధూకు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నదట
.