దేవాలయాలకు స్త్రీలు ఎలా వెళ్ళాలి?

స్త్రీలు ప్రతి శుక్రవారం గుడికి వెళుతూ ఉంటారు.ఆలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.

 How Should Women Go To Temples-TeluguStop.com

అయితే శుక్రవారం గుడికి వెళ్లే స్త్రీలు ఎలా వెళ్ళాలి.మన పెద్దలు స్త్రీలు గుడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పారు.

చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి.అలాగే నుదుట కుంకుమ ధరించాలి.

గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమను నుదుటి కుంకుమ కింద,విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి.

ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పుతున్నారు.వినాయకుని గుడికి వెళ్ళితే గరిక మాలను తీసుకువెళ్లాలి.గరిక మాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తిరటమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను ఏవైనా బాధలు ఉంటే తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.విష్ణు మూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలతో వెళ్ళాలి.ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు వెన్న తీసుకోని వెళ్ళాలి.

అదేవిధంగా దుర్గాదేవిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.

ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పెద్దలు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube