ఇంత అందంగా ఉంటే మేము ఎలా బతకాలి.. ఇస్మార్ట్ బ్యూటీకి హాట్ హాట్ ప్రశ్నలు?

సినిమాపై ఉన్న మక్కువతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మున్నా మైఖేల్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.2018 చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.అలాగే 2019 వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 How Should-we Live If It Is So Beautiful Hot Questions To The Ismart Beauty Isma-TeluguStop.com

ఈ సినిమా కూడా నిరాశ పరిచిన ప్పటికీ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

రామ్ పోతినేని హీరోగా తెరకక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ తన అందాల నిధి బయటపెడుతూ కుర్రకారు మనసు దోచింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా విజయవంతమైన తరువాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా బిజీ అయింది.ఎంతగా అంటే ఏకంగా కోలీవుడ్ ప్రేక్షకులు ఈమెకు పాలాభిషేకాలు నిర్వహించే అంతగా గుర్తింపు సంపాదించుకుంది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

Telugu Ismart, Ismart Shanker, Nidhhi Agerwal, Tollywood-Movie

ఇలా వరుస తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే నిత్యం తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అందమైన ఫోటోని షేర్ చేశారు.

ఈ క్రమంలో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారి ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకుంది.ఇకపోతే ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నలుపు రంగు చీర కట్టుకుని ఎంతో అందంగా, అమాయకంగా చూస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Telugu Ismart, Ismart Shanker, Nidhhi Agerwal, Tollywood-Movie

ఇక ఈ ఫోటో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ.మరి మీరు ఇంత అందంగా ఉంటే మేము ఎలా బ్రతకాలి అంటూ ఇస్మార్ట్ బ్యూటీ అందంపై కామెంట్లు చేస్తున్నారు.

అలాగే అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా ఏకంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube