హ్యాకింగ్‌ చేస్తే జైలుకు వెళ్తారు... కాని అతడు హ్యాక్‌ చేస్తే మాత్రం కోట్లు వస్తున్నాయి

టెక్నాలజీ ఎంత పెరిగిందో మోసాలు కూడా అంతగా పెరుగుతున్నాయి.టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో పనులు చక్కబెడుతున్న జనాలు సమయాన్ని చాలా సేవ్‌ చేసుకుంటున్నారు.

 How Santiago Lopez Is Making Millions By Hacking Legally-TeluguStop.com

ముఖ్యంగా బ్యాంకు లావా దేవీలు సగానికి పైగా టెక్నాలజీ ఉపయోగించి మొబైల్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా కానిచేస్తున్నారు.ఇంతగా అభివృద్ది చెందిన సమయంలో మోసగాళ్లు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నారు.

అద్బుతమైన టెక్నాలజీతో రూపొందించిన సాఫ్ట్‌ వేర్‌కు కూడా ఏదో ఒక చిన్న లొసుగు ఉంటుంది.దాంతో హ్యాకర్స్‌ చొచ్చుకు పోయి డబ్బును లేదా కీలకమైన డేటా చోరిని చేస్తున్నారు.

ఇండియాలో హ్యాకింగ్‌ నేరం మరియు చట్టపరమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.అయితే అమెరికాకు చెందిన శాంటియాగో లోపెజ్‌ అనే 19 ఏళ్ల కుర్రాడు హ్యాకింగ్‌ చేస్తూనే కోట్లు సంపాదిస్తున్నాడు.కాని అతడు చేసేది నేరం కాదు, అతడు హ్యాకింగ్‌ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు.ఉదాహరణకు ఏదైనా సేఫ్టీ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌ చేసి అతడు డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తాడు.

ఆ సాఫ్ట్‌వేర్‌ బగ్‌ ఏంటో ఆ కుర్రాడికి తెలుస్తుంది.అలా ఆ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వారు ఆ బగ్‌ ను క్లీయర్‌ చేస్తారు.

అలా ఆ సాఫ్ట్‌వేర్‌ మరింత సెఫ్టీ అవుతుంది.తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను కనిపెట్టినందుకు ఆ సంస్థ వారు పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తారు.

ఇలా మూడు నాలుగు సంవత్సరాలుగా హ్యాకింగ్‌తో కోట్లను లోపెజ్‌ సంపాదించాడు.మొదట ఇతడు హ్యాంకింగ్‌కు పాల్పడి దొంగతనాలు చేసేవాడు.అయితే అది అతడిని చిక్కుల్లో పడేస్తుందని వెంటనే గమనించాడు.ఆ సమయంలోనే బగ్స్‌ బౌంటీ జాబ్‌లో జాయిన్‌ అయ్యాడు.అంటే ఏ సాఫ్ట్‌వేర్‌లో, ఏ వెబ్‌ సైట్‌లో బగ్స్‌ ఉన్నాయో అతడు కనిపెడతాడు.సంస్థను బట్టి తక్కువలో తక్కువ ఒక్కో బగ్‌ కు ఇతడు వెయ్యి డాలర్ల వరకు సంపాదిస్తాడు.

రెండేళ్లలోనే లక్షల డాలర్లకు అధిపతి అయిన లోపెజ్‌ ప్రపంచంలోనే అత్యంత చిన్న ప్రముఖ హ్యాకర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్థలు ఈయన్ను సంప్రదించి తమ వెబ్‌ సైట్స్‌లో ఏమైనా బగ్స్‌ ఉన్నాయా కనిపెట్టమంటారు.

మొత్తానికి మనసు ఉండాలి కాని మార్గం దానంతట అదే లభిస్తుంది అనేది లోపెజ్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.మనం ఏ పని చేసినా కూడా పర్‌ఫెక్ట్‌గా కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేందుకు లోపెజ్‌ చక్కని ఉదాహరణ.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube