అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా వేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన( Upasana ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని( Ram Charan ) పెళ్లి చేసుకొని, 12 సంవత్సరాల నుండి అతనితో అందమైన దాంపత్య జీవితం కొనసాగిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ దంపతులిద్దరికీ రీసెంట్ గానే ‘క్లిన్ కారా’( Klin Kaara ) అనే పాప జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ చిన్నారి మెగా కుటుంబం లోకి అడుగుపెట్టడం తో కుటుంబం మొత్తం ఎంత ఆనందం గా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఉపాసన ఒక పక్క తన భర్త కి సంబందించిన వ్యక్తిగత విషయాలను చూసుకుంటూనే మరో పక్క క్లిన్ కారా బాధ్యతలతో పాటుగా, అపోలో హాస్పిటల్స్ ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది.
ఇలా ఒకేసారి మూడు క్లిష్టమైన బాధ్యతలను సమర్థవతంగా నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిల్చింది ఉపాసన కొణిదెల.ఇదంతా పక్కన పెడితే ఉపాసన గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.

అదేమిటంటే ఈమె రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోక ముందు సినిమాల్లోకి రావాలని ప్రయత్నం చేసిందట.రామ్ చరణ్ మొదటి చిత్రం ‘చిరుత’ లో( Chiruta Movie ) తొలుత ఉపాసన నే తీసుకుందాం అనుకున్నారట.కానీ సినిమా ఇండస్ట్రీ మనకి అచ్చిరాదని, వైద్య రంగం లోనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలం అని ఆమె తల్లిదండ్రులు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పారట.అలా హీరోయిన్ అవ్వాల్సిన ఉపాసన, అపోలో హాస్పిటల్స్( Apollo Hospitals ) చైర్మన్ గా మారింది.
ఈమె చైర్మన్ అయిన తర్వాత అపోలో హాస్పిటల్స్ అన్నీ విధాలుగానూ ఎవ్వరూ ఊహించనంత పురోగతి పొందింది.అంతే కాదు ఈ హాస్పిటల్స్ ద్వారా ఉపాసన ఎన్నో వేల మంది పేదలకు తన వంతు సహాయం గా ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
అంతే కాదు సోషల్ మీడియా లో తనని అనుసరించే వాళ్లకు కూడా ఆరోగ్యం గా ఉండేందుకు టిప్స్ చెప్తూ ఉంటుంది.

కరోనా మహమ్మారి సమయం లో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా పంచారో మనమంతా చూసాము.అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవ కార్యక్రమాలు అపోలో హాస్పిటల్స్ ద్వారా చేసింది ఉపాసన.ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టే మెగా అభిమానులు ఆ కుటుంబం లో ఉన్న హీరోలను ఎంత ఇష్టపడతారో, ఉపాసన ని కూడా అంతే ఇష్టపడుతారు.
సోషల్ మీడియా లో కూడా ఉపాసన కి ఉన్నంత ఫాలోయింగ్ చాలా మంది హీరోలకు కూడా లేదు.ఆ స్థాయి అభిమానం కేవలం ఈమె చేసే మంచి పనుల ద్వారా మాత్రమే వచ్చిందని ఆమె అభిమానులు అంటుంటారు.







