ఆ రోజు రాజమౌళితో కోపంతో అలా అన్నాను.. అప్పుడు అన్నది నిజమైంది  

How Rajamouli Got Jakkanna Name-

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ఈయన్ను అంతా ప్రేమతో పిలిచే పేరు జక్కన్న. బాహుబలి వంటి అద్బుతాన్ని ఆవిష్కరించిన రాజమౌళికి జక్కన్న పేరు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని అంతా అంటారు. జక్కన్న అంటూ పూర్వ కాలంలో శిల్పి ఉండేవారు..

ఆ రోజు రాజమౌళితో కోపంతో అలా అన్నాను.. అప్పుడు అన్నది నిజమైంది-How Rajamouli Got Jakkanna Name

ఆయన అద్బుతమైన కళాకంఢాలను ఆవిష్కరించాడు. ఎన్నోఅద్బుత శిలలను చెక్కాడు. ప్రతి శిల్పంను కూడా చాలా డెప్త్‌గా, లోతుగా, డీటైల్డ్‌గా చెక్కేవాడు.

అందుకే ఏదైనా పనిని మళ్లీ మళ్లీ పర్ఫెక్ట్‌గా చేస్తే వారిని ఇంకా ఎంత చెక్కుతావ్‌ర బాబు జక్కన్న మాదిరిగా అంటారు. అలాగే రాజమౌళికి కూడా వచ్చింది.

రాజమౌళి సినిమా కెరీర్‌ ప్రారంభించక ముందు సీరియల్స్‌ను చేసేవాడు.

సీరియల్స్‌లో ముఖ్యంగా శాంతినివాసం ఒకటి. ఆ సీరియల్‌లో రాజీవ్‌ కనకాలా కీలక పాత్ర పోషించాడు. ఈ సీరియల్‌ సమయంలోనే రాజమౌళి, రాజీవ్‌ కనకాల పరిచయం అయ్యారు.

సెట్స్‌లో అందరిని కూడా రాజమౌళి చాలా విసిగించేవాడట. ప్రతి సీన్‌ను కూడా చాలా లోతుగా ఆలోచించి, చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూసి, మళ్లీ మళ్లీ రీ షూట్‌ అంటూ పదే పదే యూనిట్‌ సభ్యులను విసిగించేవాడట. దాంతో రాజీవ్‌ కనకాల ఒకరోజు జక్కన్న మాదిరిగా నువ్వు సీన్స్‌ను చెక్కుతున్నావు కదా అన్నాడట.

రాజమౌళిపై ఆరోజు రాజీవ్‌ కనకాలకు కోపం వచ్చి ఆ మాట అన్నాడు. అయితే ఇప్పుడు అదే పదం రాజమౌళికి ఇంటి పేరుగా మారిపోయింది. జక్కన్న అంటూ తనను పిలిస్తే ఆయన హ్యాపీగానే ఫీలవుతాడు. ఎన్టీఆర్‌తో పాటు ఇంకా పలువురు స్టార్స్‌ కూడా రాజమౌళిని జక్కన్న అంటూ పిలుస్తారు.

ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడిగా నిలిచాడు అంటే అది ఆయన పడ్డ కష్టం, చేసే వర్క్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.