పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకునన్నాయి.ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అధ్యంతం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే కొంతమంది దర్శకులకు మాత్రం పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక డిజాస్టర్ సినిమాలు చేశారు.అందులో ముఖ్యంగా తమిళ్ డైరెక్టర్ అయిన ధరణి( Director Dharani ) పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ ( Bangaram Movie ) అనే సినిమా చేసి ఒక ఫ్లాప్ ని తన కథలో వేసుకున్నాడు.
ఇక నిజానికి బంగారం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ అవడం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక మాయ ని మచ్చ గా మిగిలిపోయిందనే చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.వాటిని రీచ్ అవ్వడంలో ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది.అందువల్లే ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అసలు హీరోయిన్ లేకపోవడం అనేదే పెద్ద మైనస్ గా మారింది.
ఆయన సినిమా మొత్తం ఒక ఇద్దరు లవర్స్ ను కలపాలని చూడడం ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు.అలాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ లేకుండా ఒక సినిమా చేయడం అనేది సరైన విషయం కాదనే చెప్పాలి.
దానివల్లే ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది.

ఇక ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా సుజిత్ డైరెక్షన్ లో ఓజీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలతో మరోసారి సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ధరణి బంగారం సినిమా తర్వాత రామ్ చరణ్( Ram Charan ) సినిమాతో కూడా సినిమా చేయాలని చూశాడు.కానీ ఆ సినిమాను చిరంజీవి క్యాన్సల్ చేశాడు…
.