యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తు్న్నాడు.
ఈ పాత్ర కోసం తారక్ లాంగ్ హెయిర్‌తో పాటు గుబురు గడ్డంతో కనిపించనున్నాడు.అయితే తన నెక్ట్స్ మూవీని ఇటీవల తారక్ ప్రారంభించాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మరోసారి నటించేందుక తారక్ ఓకే చేయగా, ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు.తారక్ కెరీర్లో 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో తారక్ కనిపిస్తాడు.
అయితే ఈ సినిమా షూటింగ్‌ను మే నెల నుండి మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా కొమురం భీం పాత్ర కోసం జుట్టుతో పాటు మీసం పెంచిన తారక్, ఈ సినిమాలో మోడ్రన్ లుక్‌లో ఎలా కనిపిస్తాడు అనే సందేహం సర్వత్రా నెలకొంది.
ఒకేసారి రెండు సినిమాల్లో షూటింగ్ జరుపుకుంటూ, రెండు లుక్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అని అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.అయితే తారక్ తన పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి వెనకాడడు.
మరి ఇప్పుడు ఈ రెండు లుక్స్ కోసం తారక్ ఎలాంటి రిస్క్ చేస్తాడో చూడాలి.