జీన్స్ త‌యారీకి ఎంత నీరు పడుతుంది? .. వివ‌రాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ప్రపంచంలో నీటి కొరత క‌లిగిన దేశాల‌లో భారతదేశం ఒక‌టి.ఇంతటి నీటి సంక్షోభం క‌లిని మ‌న‌దేశంలో ఒక జీన్స్ సిద్ధం చేయడానికి వేల లీటర్ల నీటిని ఖర్చు చేస్తారు.2019వ‌ సంవత్సరంలో వ‌చ్చిన‌ డ‌బ్ల్యుఆర్ఐ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 13వ స్థానంలో ఉంది.భారతీయ వస్త్ర పరిశ్రమ ఒక రోజుకు 425,000,000 గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తుంది.

 How Much Water Does It Take To Make Jeans People Crazy Young Man India , Jeans ,-TeluguStop.com

ఒక జత జీన్స్‌ను తయారు చేయడానికి 500 గ్యాలన్లు అంటే 1000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగిస్తార‌ని ఈ నివేదికలో పేర్కొన్నారు.ప్రపంచంలో మంచినీటి సంక్షోభం పెరిగిపోతున్న తరుణంలో జీన్స్ ఉత్పత్తి.

ఈ ఆందోళనలను రెట్టింపు చేస్తోంది.భారతదేశంలో భూగర్భ జలాలు సగటున 52 శాతం క్షీణించాయని, అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కేంద్ర భూగర్భజల సర్వే తెలిపింది.జీన్స్ తయారీలో చాలాసార్లు వాషింగ్ చేయాల్సి ఉంటుంది.దాని తయారీలో అనేక రకాల ప్రమాదకరమైన రసాయనాలను కూడా ఉపయోగిస్తారు.పత్తి దారం నుండి నూలు తీసి నీలం రంగులో ముంచుతారు.తరువాత దానికి ర‌సాయ‌నాలు జోడిస్తారు.

తద్వారా అది గట్టి ప‌డుతుంది.ఈ బట్టను డెనిమ్ అంటారు.

దీనికి బ్లీచ్ చేసేందుకు మళ్లీ నీటిని వినియోగిస్తారు.ఆమ్లాలు మరియు రసాయనాల సహాయంతో జీన్స్ రంగులు తేలికగా మారుతాయి.

ఇందుకోసం జీన్స్‌ను ప్యూమిస్ రాళ్లపై రుద్దుతారు.త‌రువాత‌ మళ్లీ నీటిలో త‌డుపుతారు.

అప్పుడు జీన్స్ కుట్టేందుకు సిద్దం అవుతుంది.అయితే ఇప్పుడు దేశంలోని అనేక బ్రాండ్లు ఇప్పుడు నీటి వినియోగంల‌పై అవగాహన పొందాయి.

జీన్స్ త‌యారీలో విద్యుత్, నీటి వినియోగాన్ని నియంత్రించాయి.దీనితో పాటు చాలా బ్రాండ్లు రసాయనాల వాడకాన్ని త‌గ్గించాయి.

How Much Water Does it Take to Make a Pair of Jeans Jeans

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube