పిల్ల‌కు పాలిస్తూ కోతి ఎంత‌లా మురిసిపోతుందో.. త‌ల్లి ప్రేమంటే ఇదేనా..

సృష్టికి మూలం అయిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.అమ్మ గొప్పతనం మాటల్లో కాని చేతి రాతల్లో కాని చెప్పలేం.

 How Much The Monkey Loves The Child Is This What The Mother Loves Details, Monke-TeluguStop.com

అమ్మ ప్రేమకు సాటి ఎవరు లేరని అయితే ఖచ్చితంగా చెప్పగలం.ఇకపోతే మనుషులకే కాదు జంతువులు, పశు పక్షాదులు సైతం అమ్మ ప్రేమను వాటి పిల్లలకు పంచుతుంటాయి.

బిడ్డల ఆకలి తీర్చేందుకుగాను తల్లులు ఎంతో కష్టపడుతుంటారు.

బిడ్డలకు అన్నం తినిపించేందుకుగాను తల్లి తను తినడం మానేస్తుంటుంది.

పిల్లలు తిన్నాకే తాను సంతృప్తి చెందుతుంది.కాగా, ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో ఓ కోతి తన బిడ్డకు పాలిస్తూ మురిసిపోతున్నది.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి ప్రేమంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు.

సదరు మంకీ తన బిడ్డను అక్కున చేర్చుకుని తన చనుపాలు పట్టిస్తోంది.

ఆ టైంలో ప్రేమను కూడా పంచుతోంది.ఈ వీడియో చూసి ఎవరైనా భావోద్వేగానికి గురవుతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

వీడియో కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది.కానీ, అందులో కోతి తన బిడ్డ కోసం పడుతున్న తపన అయితే ఈజీగా స్పష్టమవుతోంది.

ఇక పాలు తాగుతున్నంత సేపు కోతి తన బిడ్డను చూసి మురిసిపోతుంటుంది.బిడ్డను ముద్దు చేస్తుంటుంది.బిడ్డ నుదిటిపై ముద్దు పెట్టుకుని ఆనంద పడిపోతుంటుంది.జంతువులకు కూడా మనుషుల లాగే సున్నిత మైన భావోద్వేగాలు ఉంటాయని ఈ వీడియో చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

ప్రతీ తల్లి తన బిడ్డను చూసి మురిసిపోతుంటుంది.చిన్నపుడే కాదు పెద్ద అయిన తర్వాత కూడా తల్లి తన బిడ్డ టైంకు తిన్నదా లేదా అని ఆలోచిస్తుంటుంది.

ఈ క్రమంలోనే ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డే అని పెద్దలు అంటుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube