పీరియడ్స్‌ ఆలస్యంకు వేసుకునే మాత్రలు ఎంత వరకు సేఫ్‌.. ఆసక్తికర విషయం చెప్పిన డాక్టర్స్‌

ఆడవారు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య పీరియడ్స్‌.ఆ సమయంలో వారు చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు.

 How Much Safe Of Using Tablets Of Peroids-TeluguStop.com

ముఖ్యంగా ఏదైనా కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో, ఏదైనా వేడుకల్లో పాల్గొన్న సమయంలో, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొన్న సమయంలో ఆడవారు పీరియడ్స్‌తో ఉంటే వారు చాలా ఇబ్బందిగా ఉంటారు.పనిపై దృష్టిపెట్టలేక పోతారు.

అందుకే ఏదైనా ముఖ్యమైన పని ఉండటం లేదా ఏదైనా వేడుక వంటివి ఉన్న సమయంలో పీరియడ్స్‌ను ఆలస్యం చేసేలా హార్మోన్‌ టాబ్లెట్స్‌ వాడుతూ ఉంటారు.కొందరు వాటిని ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటారు.

అలా వాడటం ప్రమాదం అంటున్నారు.

పీరియడ్స్‌ను వారం రోజుల వరకు ఆపేందుకు ట్యాబ్లెట్లు వేసుకోవడం పర్వాలేదు కాని, మరీ నెలల తరబడి ఆపేందుకు కంటిన్యూస్‌గా హార్మోనల్‌ ట్యాబ్లెట్స్‌ వేసుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్‌ త్వరగా రావాలన్నా, పీరియడ్స్‌ కాస్త ఆలస్యంగా రావాలన్నా కూడా ఒకే ట్యాబ్లెట్‌ ఉంటుందని, కాని కొందరు ఆర్‌ఎంపీలు మాత్రం తెలియని వారికి ఏదో మాయ మాటలు చెప్పి ఏవో మాత్రలు ఇస్తూ ఉంటారని, ఇంజక్షన్స్‌ చేస్తారని డాక్టర్లు చెబుతున్నారు.అసలు పీరియడ్స్‌ కు ఇంజక్షన్స్‌ ఉండవని ప్రముఖ వైధ్యులు అంటున్నారు.

పీరియడ్స్‌ ఆలస్యంకు వేసుకునే

పీరియడ్స్‌ రావద్దనుకున్న సమయంలో ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి.వారం రోజుల తర్వాత వచ్చినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు వాటిని వేసుకోవడం ఆపేయాలి.ఒక వేళ పది రోజుల్లో ఏదైనా కార్యక్రమం ఉంది, ఆ తర్వాత పది రోజుల వరకు బిజీగా ఉంటారు అనుకుంటే ముందే పీరియడ్స్‌ రావాలని భావించినట్లయితే ముందుగానే రెండు రోజులు ట్యాబ్లెట్స్‌ వేసుకోవాలి.ట్యాబ్లెట్స్‌ వేసుకుని ఎప్పుడైతే ఆపేస్తారో ఒకటి రెండు రోజుల గ్యాప్‌లో పీరియడ్స్‌ వస్తాయి.

అలా ఒకే ట్యాబ్లెట్‌ పీరియడ్స్‌ రాకుండా, వచ్చేలా కంట్రోల్‌ చేస్తుంది.అంతే తప్ప రెండు రకాల ట్యాబ్లెట్స్‌ ఉండవు మరియు ఇంజక్షన్స్‌ అస్సలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్‌ ఆలస్యం అయ్యేలా వేసుకునే ట్యాబ్లెట్లు ఒక మోస్తరుగా వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు.కాని ఎప్పుడైతే పీరియడ్స్‌ ఆపేందుకు నెలల తరబడి వాటిని వినియోగిస్తారో అప్పుడు ఇబ్బంది.

వేసుకున్నన్ని రోజులు ఎలాంటి సమస్య ఉండదు.ఎప్పుడేతే వాటిని ఆపేస్తారో అప్పుడు పీరియడ్స్‌ వస్తాయి.

ఆ సమయంలో చాలా ఇబ్బంది ఉంటుంది.రక్తం గడ్డకట్టి పోవడంతో విపరీతమైన పొత్తి కడుపు నొప్పి మరియు పలు సమస్యలు వస్తాయి.

అందుకే వారంకు మించి పీరియడ్స్‌ ఆపడం కరెక్ట్‌ పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube