మేము ఫేమస్ మూవీ బ్రేక్ ఈవిన్ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలి..?

ఈ మధ్య కాలం లో తక్కువ బడ్జెట్ తో వచ్చి మంచి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.రీసెంట్ గా విడుదలైన ‘బలగం’, ‘విరూపాక్ష’( Balagam, Virupaksha ) వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.

 How Much More Should We Earn If We Want To Break Even The Famous Movie Details,-TeluguStop.com

అదే కోవలో అసలు ముఖ పరిచయం లేని నటీనటులతో చేసిన సరికొత్త ప్రయోగం ‘మేము ఫేమస్’( Memu femas ) .చాయ్ బిస్కట్ సంస్థ నుండి నిర్మితమైన ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్( Sumanth prabhas )అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తూనే హీరో గా కూడా చేసాడు…

Telugu Memu Femas, Sumanth Prabhas, Sumanthprabhas-Movie

ఆకర్షణీయమైన ట్రైలర్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరిగింది.మరి మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టింది.?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రావాలి?,.అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము…

 How Much More Should We Earn If We Want To Break Even The Famous Movie Details,-TeluguStop.com

తెలంగాణ నేటివిటీ తో తెరకెక్కిన ఈ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్ దక్కింది.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలంగాణాలో మొదటి రోజు 52 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.అలాగే ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతానికి కలిపి 34 లక్షల రూపాయిల గ్రాస్, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల నుండి 86 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది…

Telugu Memu Femas, Sumanth Prabhas, Sumanthprabhas-Movie

ఇక ఓవర్సీస్ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 24 లక్షల రూపాయిల గ్రాస్, మొత్తం మీద కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ మరియు 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో కోటి 50 లక్షల రూపాయిల షేర్ రావాల్సి ఉంది.ప్రస్తుతం సరైన సినిమాలు కూడా ఏమి లేకపోవడం తో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube