'షట్ డౌన్'...నష్టం తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!!!  

అమెరికా చరిత్రలోనే అత్యధిక రికార్డ్ స్థాయిలో షట్ డౌన్ గా కొనసాగిన ఏకైక ఏడాదిగా చరిత్రలో నిలిచి పోయింది. ఒక పక్క ట్రంప్ పంతం, మరో పక్క డెమోక్రటిక్ పార్టీ పట్టుదల ఈ రెండు కారణాల వలన అమెరికాలో జీవనం స్తంభించింది. ఎంతో మంది ఉద్యోగులు తినడానికి తిండిలేని పరిస్థితిలో ఇబ్బందులు పడ్డారు. చివరికి స్వచ్చంద సంస్థలు ఆయా ఉద్యోగులకి భోజన సదుపాయం కలిగించే పరిస్థితి ఏర్పడింది..అయితే

How Much Is Shutdown Worth In America-Shutdown America Shutdown Telugu Nri News Updates

How Much Is Shutdown Worth In America

ఈ షట్ డౌన్ వలన జరిగిన నష్టం ఎంత అయ్యి ఉంటుందని అంచనా వేశారు ఆర్ధిక నిపుణులు. ఈ పరిణామాలతో అమెరికా ఆర్ధిక వ్యవస్థకి దాదాపు 21వేల కోట్లు మేర నష్టం వాటిల్లిందని అంచనాలు వేస్తున్నారు. వేతనాలు 8 లక్షల మందికిపైగా ఫెడరల్‌ ఉద్యోగులు సోమవారం నుండి తమ తమ విధులకు హాజరవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

How Much Is Shutdown Worth In America-Shutdown America Shutdown Telugu Nri News Updates

మొత్తమ్మీద ఈ 5 వారాల షట్ డౌన్ తో అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 1100 కోట్ల డాలర్ల మేర నష్టం వచ్చిందని సిబీవో తెలిపింది. అయితే ప్రస్తుతం అమెరికా తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడంతో 800 కోట్ల డాలర్ల మేర రికవర్‌ అయ్యే అవకాశం వుందని కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు.