సిజేరియన్ తరువాత మళ్ళీ ఎన్నినెలలు గర్భం దాల్చకూడదు ?

బిడ్డను ప్రసవించడానికి తల్లి ఎన్ని బాధలు పడుతుందో, ప్రసవించాక కూడా ఎన్ని ఇబ్బందులు పడతుందో ఒక సిజేరియన్ ఆపరేషన్ జరిగిన మహిళను అడిగితే చెబుతుంది.నొప్పి, గాట్లు, రక్తం ఇన్ని చూసిన తరువాత తిరిగి కోలుకోవాలంటే ఏ స్త్రీకి అయినా కొంత సమయం పడుతుంది.

 How Much Gap Should Be Given To Pregnancy After Caesarean?-TeluguStop.com

అందుకే ప్రగ్నెన్సి మీద మళ్ళీ తొందరపడకూడదు అంటారు డాక్టర్లు.

జనరల్ గా చెప్పాలంటే, మళ్ళీ గర్భం దాల్చేముందు కనీసం 18-24 నెలల సమయం ఇవ్వాలని చెబుతారు వైద్యులు.

ఇక సిజేరియన్ జరిగిన మహిళ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పోగొట్టుకున్న రక్తం, న్యూట్రింట్స్, పడిన కాటు, అన్ని సర్దుకోని స్త్రీ పూర్వ స్థితిలోకి రావాలంటే కొంత సమయం పడుతుంది.ఎంత అంటే చెప్పటం కష్టం.

శరీర తత్వాన్ని బట్టి మారవచ్చు.

సిజేరియన్ తరువాత తొందరగా గర్భవతి అయితే నార్మల్ డెలివరీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

పెద్ద ఆపరేషన్ తరువాత ఎంతలేదన్నా, కనీసం ఆరు నెలల నుంచి ఏడాది కాలం దాకా అసలు గర్భం అనే అలోచనే రాకూడదట.అదే 18-24 నెలలు ఆగితే ఇంకా బెటర్.

లేదంటే రాప్చర్డ్ యుటేరస్, ప్రమెచ్యూర్ ప్రసవం, బరువు తక్కువ ఉన్న బిడ్డ .ఇలా ఏదైనా జరగవచ్చు.ఒక్కోసారి తల్లి ప్రాణం కూడా ప్రమాదంలో పడవచ్చు.అందుకే ఫ్యామిలి ప్లానింగ్ చాలా ముఖ్యం.కుదిరితే ఇద్దరు బిడ్డలకి మూడు సంవత్సరాల గ్యాప్ ఇస్తే బెటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube