పెళ్లిలో అత్యంత ఖరీదైన దుస్తులు ధరించే సెలబ్రిటీలు.. వాటికి ఎంత ఖర్చు పెడతారంటే..?!

పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.ఇద్దరు మనుషులు పెళ్ళి అనే బంధంతో ఒక్కటి అయ్యి ఒకే బాటలో ముందుకు సాగే ఒక జీవన ప్రయాణం.

 How Much Celebrities Are Spending For Their Clothes In Their Marriages-TeluguStop.com

ఆ పెళ్ళిలో కనిపించే సందడే వేరు.చుట్టూ బంధువులు, మేళాలు, తాళాలు, పందిర్లు, ఆటలు పాటలు, భోజనాలు ఇలా ఒకటి ఏంటి అన్ని కూడా చూడడానికి కనువిందుగా ఉంటాయి.

అయితే పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరి చూపు నూతన వధూవరులు మీదనే ఉంటుంది.ఎందుకంటే పెళ్ళి కూతురు ఎలా ఉందా.? ఏ చీర కట్టిందా.? ఎటువంటి నగలు ధరించిందా.? అనే అతృతతో ప్రతి ఒక్కరు ఎదురుచూస్తూ ఉంటారు.అలానే ప్రతి ఒక్కరు కూడా పెళ్ళికి ఎంత డబ్బులు అయిన ఖర్చు పెడుతూ ఉంటారు.

 How Much Celebrities Are Spending For Their Clothes In Their Marriages-పెళ్లిలో అత్యంత ఖరీదైన దుస్తులు ధరించే సెలబ్రిటీలు.. వాటికి ఎంత ఖర్చు పెడతారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మన సెలబ్రిటీలు విషయానికి వస్తే.మనలాగా డబ్బులు గురించి ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లిరోజున అందరి దృష్టి వాళ్ళ మీదే ఉండేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా జంకరు.

ఇప్పుడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుంది కావున మనం సెలెబ్రిటీలు వాళ్ళ పెళ్లిళ్లకు ఎంత డబ్బులు ఖర్చుపెట్టి పెళ్ళి వస్త్రాలు ధరించారో చూద్దాం.

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ఐశ‍్వర్యారాయ్‌ అమితాబ్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ ను 2007, ఏప్రిల్‌ 20న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీళ్ళు పెళ్లిరోజున సంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు.మంగళూరు భామ అయిన ఐశ్వర్యారాయ్ వాళ్ళ సాంప్రదాయ పద్దతిలో నీతా లుల్లా డిజైన్‌ చేసిన కాంజీవరం చీర ధరించింది.బంగారు తీగలు, స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌ తో నిండిన చీర ఖరీదు దాదాపు రూ.75 లక్షల దాక ఉంటుందట.అలాగే సాగరకన్య అయిన శిల్పాశెట్టి ఏమి తక్కువే కాదు ఏకంగా అరకోటి విలువైన చీర ధరించింది.2009లో రాజ్‌ కుంద్రా ను వివాహమాడిన శిల్పా శెట్టి పెళ్లినాడు తరుణ్‌ తహిలియాని రూపొందించిన అవుట్‌ ఫిట్‌ ధరించారు.ఇందులో దాదాపు 8000 స్వరో వ్‌స్కీ క్రిస్టల్స్‌ ఇమిడి ఉన్నాయి.దాని ధర రూ.50 లక్షలు దాక ఉంటుందట.

Telugu Abhishek Bachchan, Aishwarya Rai, Bollywood Celebrities Marriages, Celcbraties, Costumes, High Costly, Maraige, Nick Jonas, Priyanka Chopra, Shilpa Shetty, Sonam Kapoor, Viral Latest, Viral News-Latest News - Telugu

అలాగే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ని ప్రేమించి 2017లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట పెళ్లిరోజున సవ్యసాచి ముఖర్జీ డిజైన్‌ చేసిన అవుట్‌ ఫిట్లలో అభిమానులకు కన్నులవిందు చేశారు.పెళ్లిలో అనుష్క ధరించిన పేస్టల్‌ కలర్‌ లెహంగా ఖరీదు సుమారు 30 లక్షల రూపాయలట.

అలాగే బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందింన సోనం కపూర్ కూడా పెళ్లిలో తళుక్కుమంది.

సోనమ్ 2018లో ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా ఆమె అనురాధా వకీల్‌ రూపొందించిన ఎరుపు రంగు సారీ లో అదరగొట్టింది.

దీనికోసం సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట.

Telugu Abhishek Bachchan, Aishwarya Rai, Bollywood Celebrities Marriages, Celcbraties, Costumes, High Costly, Maraige, Nick Jonas, Priyanka Chopra, Shilpa Shetty, Sonam Kapoor, Viral Latest, Viral News-Latest News - Telugu

ఇంకా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ వివాహం 2018లో జరిగింది.పెళ్లి సందర్భంగా పిగ్గీచాప్స్‌ ధరించిన ఎరుపు వర్ణం గల లెహంగా ఖరీదు సుమారు 18 లక్షల రూపాయలంట.అలాగే బాలీవుడ్ లో రొమాంటిక్ కపుల్ గా పేరుగాంచిన దీపికా పదుకొనె- రణ్‌వీర్‌ సింగ్‌ 2018లో ఇటలీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.వీరిరువురు పెళ్లిలో సవ్యసాచి డిజైన్‌ చేసిన అవుట్‌ ఫిట్లు ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు.”సదా సౌభాగ్యవతి భవ” అని దేవనాగరి లిపితో దుపట్టాపై లిఖించుకున్న దీపికా.తన లెహంగా కోసం దాదాపు 9 లక్షలు ఖర్చుపెట్టారట.అలాగే వీరే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది ఎన్నో లక్షలు విలువ చేసే అందమైన దుస్తులు ధరించి మరింత కనువిందు చేసారు.

#Aishwarya Rai #Costumes #Sonam Kapoor #Shilpa Shetty #Maraige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు