'ఎన్జీకే' తెలుగు రైట్స్‌ ఎంతకు కొన్నారు... బయ్యర్ల పరిస్థితి ఇది

తమిళ మెగా హీరోగా గుర్తింపు దక్కించుకున్న సూర్యకు గత రెండు మూడు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితి కొనసాగుతుంది.ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి.

 How Much Amount Spend Telugu Ngk Rights-TeluguStop.com

గత మూడు సంవత్సరాల్లో ఆయన నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న పాపన పోలేదు.దాంతో తాజాగా చాలా నమ్మకం పెట్టుకుని సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో నటించాడు.

విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సెల్వరాఘవన్‌ తప్పకుండా సూర్యకు మంచి హిట్‌ ఇస్తాడని అంతా భావించారు.

సూర్య కూడా చాలా కాలం తర్వాత సక్సెస్‌ దక్కించుకోబోతున్నట్లుగా ‘ఎన్జీకే’ చిత్రం ప్రమోషన్‌ సమయంలో చెప్పుకొచ్చాడు.

సెల్వ రాఘవన్‌ తప్పకుండా సూర్యకు హిట్‌ కట్టబెడతాడని భావిస్తే అనూహ్యంగా సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.తెలుగులో ఎన్జీకేకు మంచి క్రేజ్‌ దక్కింది.ఆ కారణంగా సినిమాను తెలుగు బయ్యర్లు 9 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.తీరా చూస్తే సినిమా కనీసం కోటి రూపాయలు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టలేక పోయింది.

లాంగ్‌ రన్‌ లో ఎన్జీకే చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కోటిన్నర వరకు రాబట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది.దాంతో నష్టం ఖచ్చితంగా 7.5 కోట్లు ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు మంచి క్రేజ్‌ ఉంది.

కాని ఇలా ఒక్కసారిగా సినిమా డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకోవడంతో సినిమా ఏమాత్రం కలెక్షన్స్‌ను రాబట్టలేక పోతుంది.సూర్య కెరీర్‌లోనే ఇది అతి పెద్ద డిజాస్ట్రర్‌గా సినీ వర్గాల వారు అంటున్నారు.

తమిళ సినీ పరిశ్రమలో ఇంతటి డిజాస్టర్‌ సూర్యకు గతంలో ఎప్పుడు రాలేదు.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి వారంలో కనీసం 10 కోట్ల గ్రాస్‌ను రాబట్టలేక పోయింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సూర్య మళ్లీ పుంజుకునేందుకు ఈసారైనా చూసి మంచి సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube