రోజుకి ఇన్నిసార్లు మూత్ర విసర్జన్ల జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు

మూత్ర విసర్జన అంటే మన శరీరంలో చెత్తని ఒక ద్రవం రూపంలో బయటకి పంపడం.మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలన్నిటిని బయటకి పంపి, శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.

 How Many Times One Should Pee Every Day-TeluguStop.com

కాబట్టి మూత్ర విసర్జన అనేది మనకు లాభపడే చర్య.కాని ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేయాలో తెలుసా?

మూత్రవిసర్జన అనేది ప్రతిరోజు జరిగే చర్య.ఇది రోజూ ఒకేలా ఉండదు.ఒకరోజు 5 సార్లు మూత్రవిసర్జన కావచ్చు, మరోరోజు 8 సార్లు కావచ్చు, ఇంకోరోజు 4 సార్లే కావచ్చు.అది మనం నీరు తాగుతున్న తీరుని బట్టి మారుతూ ఉంటుంది.అయితే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి కనీసం 4 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు.

కనీసం 4 సార్లు అన్నాం కాబట్టి, ఇది రోజుకి 6-8 సార్లు జరిగినా ఇబ్బందేమి లేదు.రోజుకి 4-10 సార్లు మూత్రవిసర్జన చేసినా ఆరోగ్యంగా ఉన్నట్టే.

కాని నీరు తక్కువ తాగినా, 8-10 సార్లు మూత్ర విసర్జన జరిగితే, అప్పుడు ఏదో సమస్య ఉన్నట్లు.అలాగే రోజుకి కనీసం 4 సార్లు మూత్రవిసర్జన జరగకపోయినా, మనిషి ఆరోగ్యంగా లేనట్టే.

అయితే నీరు తక్కువ తాగుతున్నారు, లేదంటే మూత్రపిండాలు సరిగా పనిచేయట్లేదు అన్నమాట.

అందుకే మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీళ్ళు తాగాలి.అప్పుడే మూత్రవిసర్జన సరిగా జరుగుతుంది.మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube