ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా జట్టు ఎన్నిసార్లు సెమీఫైనల్ మ్యాచ్లలో ఓడిందంటే..?

ప్రపంచ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లలో అద్భుత ఆటను ప్రదర్శించి సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు( South Africa ) ఫైనల్ కు వెళ్లకుండా వెను తిరగడం ఇది ఏకంగా 5వ సారి కావడం గమనార్హం.ప్రపంచ కప్ 2023లో( World Cup 2023 ) భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా( SA vs Aus ) సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఒత్తిడికి గురైన సౌత్ ఆఫ్రికా జట్టు, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓటమిని చవిచూసింది.

 How Many Times Has The South African Team Lost In The World Cup Semi-final Match-TeluguStop.com

సాధారణ మ్యాచులలో విజేతగా నిలిచే సౌత్ ఆఫ్రికా కు కీలక మ్యాచ్లలో ఓటమిని చవిచూడడం అలవాటు అయ్యింది.అందుకే సౌత్ ఆఫ్రికా జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు.

సౌత్ ఆఫ్రికా జట్టు 1992, 1999, 2007, 2015 లలో జరిగిన ప్రపంచ కప్ లలో సెమీ ఫైనల్ నుంచి ఇంటి దారి పట్టింది.అంతేకాదు 2009, 2014 టీ20 ప్రపంచ కప్ లలో కూడా సౌత్ ఆఫ్రికా జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్లలో ఓడి ఇంటిదారి పట్టింది.

తాజాగా ఈ 2023 ప్రపంచ కప్ టోర్నీలో ఫుల్ ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ చేరుతుందని అంతా భావించారు.కానీ కీలక సెమీఫైనల్ మ్యాచ్లో( Semi Final ) సౌత్ ఆఫ్రికా ఘోర ఓటమిని చవిచూసి ఇంటి దారి పట్టింది.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చోకర్స్ అంటు సౌత్ ఆఫ్రికా జట్టును ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

సౌత్ ఆఫ్రికా జట్టు సెమీఫైనల్ మ్యాచ్లో గెలవక పోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే.డికాక్,( DeCock ) వాండర్డసెన్( Van Der Dussen ) విఫలం కావడమే.మిల్లర్ సెంచరీ( Miller ) చేసినప్పటికీ.

సౌత్ ఆఫ్రికా జట్టు విజయానికి సరిపడే పరుగులు చేయలేకపోయింది.మరొకవైపు ఫీల్డింగ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు ఆటగాళ్లు క్యాచ్లు మిస్ చేయడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube