ఈ బ్యాంకు ఏటీఎంలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయవచ్చట.. !!

ఈ మధ్యకాలంలో దాదాపుగా అన్ని బ్యాంకులు తమ వినియోగదారుల వీపులు విమానం మోత మోగిస్తున్న విషయం తెలిసిందే ఒకప్పటి కంటే ప్రస్తుతం చార్జీలు ఎక్కువగా వసూలు చేయడం మొదలు పెట్టాయి.అలాగే ఏటీఎం నుండి డబ్బులు విత్‌ డ్రా విషయంలో కూడా లిమిట్స్ చాలా వరకు తగ్గించాయి మోసగాళ్లకు పెద్ద మొత్తంలో లోన్లు ఇచ్చి అవి వసూల్ చేసుకో లేక ఆ భారాన్ని సామాన్య ప్రజల మీద బ్యాంకులు మోపుతున్నాయనే అపవాదును కూడా మూటగట్టుకున్నాయి.

 How Many Times Can You Withdraw Money At This Bank Atm Indusind Bank, Idbi Bank,-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం కొన్ని ఏటీఎం లో నాలుగు సార్ల కంటే ఎక్కువగా నగదు విత్ డ్రా చేస్తే సుమారుగా రూ 20 వరకు ఫైన్ వసూలు చేస్తున్నారట.అంతే కాకుండా సదరు వినియోగ దారుని అకౌంట్లో ఉన్న మనీ కంటే ఎక్కువ డ్రా చేద్దామని పొరబాటున అమౌంట్ ఏటీయంలో కొడితే దీనికి కూడా అపరాధ రుసూం కింద ఫైన్ పడుతుందట.

మరి ఏటీఎం లో డబ్బులు లేకుంటే బ్యాంకులకు కూడా ఫైన్ వేస్తే బాగుండునని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.ఇకపోతే ఇదంతా ఎందుకు ఫ్రీగా ఎన్ని సార్లైన డబ్బులు డ్రా చేసుకునే వీలుంటే బాగుండు అని అనుకుంటున్నారా అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ లో మాత్రం ఎన్ని సార్లు అయిన ఉచిత ఏటిఎం లావాదేవీలు చేయవచ్చట.

కాగా ఐడిబిఐ బ్యాంక్ తన సొంత బ్యాంకు నుంచి అపరిమిత లావాదేవీలకు మినహాయింపు ఇస్తుంది.ఇక సిటీ బ్యాంక్‌లో కూడా పరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం ఉందట ఇదండీ సంగతి.

ఇక చాయిస్ మీదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube