కేసీఆర్‌ డెడ్‌లైన్‌కు బెదిరి జాయిన్‌ అయిన ఆర్టీసీ కార్మికులు ఎంత మందో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన రెండవ డెడ్‌ లైన్‌ కూడా ముగిసింది.5వ తారీకు మద్యరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో జాయిన్‌ అవ్వాలంటూ కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది.ఈ క్రమంలో ప్రభుత్వం నుండి పట్టు విడుపు లేని కారణంగా చేసేది లేక కార్మికులు సమ్మె విరమిస్తారని చాలా మంది అనుకున్నారు.

 How Many Rtc Employes Are Join In Duty-TeluguStop.com

కాని కార్మికులు సీఎం కేసీఆర్‌ కంటే మొండిగా ఉన్నారు.నిన్న రాత్రి వరకు కేవలం 360 మంది మాత్రమే కార్మికులు విధుల్లో చేరినట్లుగా సమాచారం అందుతోంది.అందులో కూడా ఎక్కువగా ఆఫీస్‌ స్టాప్‌ ఉన్నారు.

హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.డ్రైవర్లు మరియు కండక్టర్లు కాకుండా పరిపాలన సిబ్బంది ఎక్కువ శాతం ఉన్నారు.200 మంది పరిపాలన సంబంధిత సిబ్బంది జాయిన్‌ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.గ్రేటర్‌ హైదరాబాద్‌ మరియు రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 100 మంది జాయిన్‌ అవ్వగా ఇతర ప్రాంతాలకు చెందిన సిబ్బంది 260 మంది ఉన్నారు.వీరిపై కూడా ఆర్టీసీ కార్మి సంఘాల నేతలు ఒత్తిడి చేశారట.

అయినా కూడా వారు ఆర్థిక పరిస్థితులు ఇతరత్ర విషయాల కారణంగా జాయిన్‌ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube