అమెరికా వెళ్ళే వారిలో ఎంత మందికి ఈ రూల్ గురించి తెలుసు...!!!

అగ్ర రాజ్యం అమెరికాకు ఉద్యోగం, వ్యాపారం , ఉన్నత విద్య ఇలా ఎన్నో రకాల కారణాల వలన ప్రపంచ దేశాల నుంచీ వలసలు వెళ్తుంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి కూడా ఈ స్థాయిలో వలసలు ఉండవంటే అమెరికా వెళ్ళే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 How Many People Who Go To America Know About This Rule America , India , China-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా వెళ్ళే వారిలో భారతీయులు అత్యధిక శాతంగా ఉండగా ఆ తరువాత స్థానంలో చైనా, ఇతర దేశాలు ఉంటాయి.అయితే చాలా మంది అమెరికా వెళ్తారు కానీ అక్కడ పాటించవలసిన నియమనిభందలు చాలామందికి తెలియదు.

ఇప్పుడు చెప్పబోయే విషయం ఎంతో మంది ఎన్నారైలు ఎదుర్కునే ఉండి ఉంటారు…ఈ విషయంపై అవగాహనా ఉన్నా సరే చాలామంది మర్చిపోయి ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులకు గురవుతుంటారు…అదేంటంటే.

చాలామంది భారత ఎన్నారైలు భారత్ నుంచీ అమెరికా వెళ్ళే సమయంలో తమతో పాటు వారి ఆరోగ్య సంభందిత లేదంటే వారి కుటుంభ సభ్యుల ఆరోగ్య సంభందిత మందులను పెద్ద మొత్తంలో కొనుక్కుని వెళ్తుంటారు.

మరి అమెరికాలో మందులు దొరకవా అంటే దొరుకుతాయి కానీ వాటి సంఖ్య భారత్ లో కంటే ఎక్కువగా ఉండటమో లేదా భారత్ లో వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం వలనో ఇలా పలు రకాల కారణాల వలన భారత్ నుంచీ మందులు తీసుకువెళ్తారు.అయితే.

Telugu America, China, India, Indian Doctors, Indian Nris, Ndian Nris-Telugu NRI

ఎన్నారైలు ఫ్లైట్ టైం అవుతుందనే కంగారులోనో లేదంటే మర్చిపోయిన కారణమో, అజాగ్రత్త వలనో డాక్టరు రాసిన మందుల చీటిని తీసుకువెళ్లకుండా కేవలం మందులను మాత్రమె తమతో తీసుకువెళ్తారు.కానీ అమెరికా నియమనిభంధనల ప్రకారం.ఏ దేశానికి చెందిన వారైనా సరే తమ దేశంలోకి మందులు తెచ్చే క్రమంలో వాటియొక్క డాక్టర్ రాసిన చీటీ కూడా ఉండి తీరాల్సిందే.అంతేకాదు మందును ఉన్న బాక్స్ పై డాక్టర్ సూచించిన సూచనలు కూడా రాసి ఉండాలి.

ఇక విదేశాలలో ఎన్నేళ్ళు ఉంటారో అంత కాలానికి మాత్రమే మందులు తీసుకువెళ్ళాలి.వీటిలో ఏ నిభందన పాటించక పోయినా సరే మీ మందులను తీసుకువెళ్ళేఅవకాశాన్ని మీరు కోల్పోతారు.

అందుకే అనారోగ్య సమస్యల కారణంగా మందులు తీసుకువెళ్ళే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా డాక్టర్ రాసిన మందుల చీటిని తప్పకుండా మీతో పాటు ఉంచుకోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube