దేశంలో కరోనా టీకా కోసం ఎంతమంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి వారు ఈ మాయదారి రోగానికి మందుంటే బాగుండు అని ఆశించారు.తీరా కరోనాకు టీకా వచ్చాక అది ఇప్పించుకోవడానికి భయపడ్డారు.

 People, Registered, Corona Vaccine, India, Country, Number Of Indians Registered-TeluguStop.com

ఇలాంటి తర్జబర్జనల మధ్య మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ పక్రియ విజయవంతగా సాగుతుంది.
ఇప్పటికే ఎందరో ప్రముఖులు, రాజకీయ, సినిరంగానికి చెందిన వారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు ఎంత మంది కరోనా వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేయించుకున్నారనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఆ వివరాలు చూస్తే.

ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ కోసం 2.6 కోట్ల మంది రిజిస్ట్రేషన్​ చేసుకోగా, అందులో 75 శాతం అపాయింట్ మెంట్లు కొవిన్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఆన్ లైన్ లో జరిగినవేనని, మిగతా రిజస్ట్రేషన్లన్నీ టీకాలు వేసే కేంద్రాల వద్దే జరిగాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 58.5 శాతం పురుషులుండగా, 41 శాతానికిపైగా మహిళలున్నారు.ఇతర విభాగంలో 3,775 మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారని వెల్లడించింది.మొత్తంగా 2.4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.అందులో 82 శాతం మంది మొదటి డోసు తీసుకున్న వారే ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube