సుశాంత్ మృతి కేసులో నిందితులుగా ఎంతమంది అంటే.. ?

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం చార్జి షీట్‌ ను దాఖ‌లు చేసింది.కాగా ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌సీబీ అధికారులు 34 మందిని అరెస్ట్ చేయగా సుమారుగా 200 మంది సాక్షుల‌ను విచారించారు.

 How Many People Are Accused In The Sushant Murder-TeluguStop.com

ఈమేరకు డిజిట‌ల్ ఫార్మాట్‌ లో చార్జి షీట్ సుమారు 50 వేల పేజీల వరకు తయారు చేశారు.

ఇకపోతే సుశాంత్ మృతితో పాటుగా డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉన్న సుమారు 12 వేల పేజీల చార్జి షీట్‌ను ప్ర‌త్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో స‌మ‌ర్పించింది.

 How Many People Are Accused In The Sushant Murder-సుశాంత్ మృతి కేసులో నిందితులుగా ఎంతమంది అంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఆ చార్జిషీట్ లో సుశాంత్ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు మ‌రో 32 మంది నిందితులను చేర్చింది.ఇక చార్జి షీట్‌ను ఎన్‌సీబీ చీఫ్ స‌మీర్ వాంఖ‌డే కోర్టుకు స‌మ‌ర్పించారు.

ఇకపోతే ఈ కేసుతో సంబంధం ఉన్న సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌ లో అరెస్ట్ చేశారు.రియా సోద‌రుడు శౌవిక్ ‌ను కూడా అరెస్టు చేసి ఆ త‌ర్వాత బెయిల్‌ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

#Accused #Actor #NcbChief #NDPS Court #Charge Sheet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు