దేశంలో మాసాహారులు.. శాఖాహారులు ఎంతమంది ఉన్నారో తెలుసా?

ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) తాజా డేటాలో ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు మాంసాహారులు అని వెల్లడయ్యింది.అయితే దేశంలోని వివిధ ప్రాంతాల సగటు గణాంకాలతో దీనికి సారూప్యత లేదు.

 How Many Non Vegetarian And Vegetarian People In Your State , Non Vegetarian , V-TeluguStop.com

రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే శాకాహారం ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున వినియోగంలో ఉంది.ఇక మాంసాహారం తినేవారి విషయానికి వస్తే స్త్రీల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువ.23 శాతం మంది మహిళలు చికెన్, మటన్ లేదా చేపలను ఎప్పుడూ తినలేదు.పురుషులలో ఈ సంఖ్య 15 శాతం మాత్రమే.

అంటే ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు, ప్రతి ఆరుగురు పురుషులలో ఐదుగురు మాంసాహారులు.

ఉత్తర, మధ్య భారతదేశంలోని పరిస్థితుల గురించి ప్రస్తావిస్తే పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్.ఛత్తీస్‌గఢ్‌లలో 50.7 శాతం మంది మహిళలు 3 శాతం మంది పురుషులు నాన్ వెజ్ ముట్టుకోరు.తూర్పు, దక్షిణ భారతదేశం గురించి ప్రస్తావిస్తే ఇక్కడ తక్కువ శాఖాహారులు, అధికసంఖ్యలో మాంసాహారులు కనిపిస్తారు.అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, సిక్కింలలో దాదాపు 99 శాతం మంది మాంసాహారులున్నారు.ఈ రాష్ట్రాల్లో 1.6 శాతం స్త్రీలు, 1.3 శాతం పురుషులు మాత్రమే శాఖాహారులు.గుజరాత్ భారతదేశంలో నాల్గవ అతిపెద్ద శాఖాహార రాష్ట్రం.

గుజరాత్‌లో 61 శాతం మంది మహిళలు, 50 శాతం మంది పురుషులు నాన్ వెజ్ తినరు.కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలో 8 శాతం మంది మహిళలు, 5 శాతం మంది పురుషులు మాత్రమే నాన్ వెజ్ తినని వారున్నారు అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube