దేశంలో కొత్త‌గా కరోనా నిర్ధారణ ఎంతమందికి అయ్యిందంటే.. ?- How Many New Corona Diagnoses Have Been Made In The Country

india, covid 19, corona virus, new test - Telugu Corona Virus, Covid-19, India, New Test

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇంకా కొత్తగా కోవిడ్ కేసులు అక్కడక్కడ నమోదు అవుతూనే ఉన్నాయి.అదీగాక ఈ వ్యాక్సిన్ వల్ల కొందరు అస్వస్దకు గురవుతున్నారట.

 How Many New Corona Diagnoses Have Been Made In The Country-TeluguStop.com

ఇకపోతే తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను విడుదల చేసింది.ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.

దేశంలో గడిచిన గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా నిర్ధారణ అయిందని, 15,948 మంది కోలుకున్నారని పేర్కొంటున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరుకుందట.

భారతీయ వైద్య పరిశోధన మండలి నిన్నటి వరకు మొత్తం 19,17,66,871 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు, నిన్న ఒక్కరోజే 7,81,752 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.ఇకపోతే గడచిన 24 గంటల్లో 155 మంది కరోనా కారణంగా మృతి చెందగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగిందట.

ఇక కరోనా మన మధ్య నుండి పూర్తిగా పోని కారణంగా ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది.

#New Test #COVID-19 #India #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు