తొలిసారి కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎప్పుడు, ఏ సినిమాలో నటించారో తెలుసా?

అల్లూరి సీతారామరాజు ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి మదిలో మెదిలేది సూపర్ స్టార్ కృష్ణ.ఎందుకంటే ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించడం చేసి ఆ పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పాలి.

 How Many Movies Done By Krishna As Alluri Sitharamaraju  Krishna,  Alluri Sithar-TeluguStop.com

ఇప్పుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడుకుంటే కృష్ణ రూపమే అందరి కళ్ళముందు మెదిలింది అని చెప్పాలి.ఆ తర్వాత కాలంలో ఎంతోమంది అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించినా ఎందుకో కృష్ణకు ఆ పాత్ర సెట్ అయినట్టుగా మిగతా వారికి సెట్ కాలేదు.

అల్లూరి సీతారామరాజు అనే టైటిల్ తో 1974లో విడుదలైన సినిమా సూపర్ స్టార్ కృష్ణకు ఊహించని రీతిలో పేరును తెచ్చిపెట్టింది అని చెప్పాలి.ఆయన కెరీర్లోనే ఒక పెద్ద మైలురాయిగా కూడా మిగిలింది.

అల్లూరి సీతారామరాజు సినిమాలోనే సూపర్ స్టార్ కృష్ణ ఆ పాత్రలో మొదటిసారి నటించారు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు దాదాపు ఆరేళ్ల ముందుగా మరో సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారట సూపర్ స్టార్ కృష్ణ.

ఆ సినిమా పేరే అసాధ్యుడు 1968 లో ఈ సినిమా విడుదలైంది.హీరోగా మారిన మూడేళ్ల తర్వాత ఇక ఈ సినిమాను చేస్తారు సూపర్ స్టార్ కృష్ణ.

Telugu Asadyudu, Ksrdas, Krishna, Ramachandra Rao, Sri Sri, Tollywood-Latest New

ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర నృత్య రూపంలో వస్తుంది అని చెప్పాలి.అయితే అసాధ్యుడు సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సమయంలో తెల్లదొరల గుండెల్ని ఝల్లుమనిపించు అనే ఒక ఉద్వేగ పూరితమైన పాటను రాశారు శ్రీశ్రీ.ఇక ఈ పాట ఎంతో మంది లో రక్తాన్ని ఉరకలెత్తించింది అని చెప్పాలి.ఆ తర్వాత ఇక సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో శ్రీ శ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాట కూడా ఎంతో ఉత్తేజంగా ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే అసాధ్యుడు సినిమా దర్శకుడు రామచంద్రరావు డైరెక్షన్లోనే అల్లూరి సీతారామరాజు కూడా మొదలైంది.కానీ మధ్యలో ఆయన ఆకస్మిక మరణం పొందడంతో చివరికి కె.ఎస్.ఆర్.దాస్ సినిమాను పూర్తి చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube