వైసీపీ( YCP ) నుంచి ఆరో జాబితా విడుదల అయిపోయింది.ఇంకెన్ని జాబితాలు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి.
పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో జగన్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నిర్ణయాలు ప్రత్యర్థులకే కాక, సొంత పార్టీ నేతలకు షాక్ ను కలిగిస్తున్నాయి.
పార్టీకి, ప్రజలకు, పెద్దగా తెలియని వారిని చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ప్రకటించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడటం, ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో, జగన్( YS Jagan Mohan Reddy ) స్పీడ్ పెంచుతున్నారు.
అభ్యర్థుల ఎంపిక వీలైనంత త్వరగా పూర్తిచేసి , పూర్తిగా వారు జనాల్లో ఉండే విధంగా ప్లాన్ చేశారు.అందుకే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తగానే పరిశీలన చేసి విడతల వారీగా జాబితాను ప్రకటిస్తున్నారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన 5 జాబితాలో 61 అసెంబ్లీ స్థానాలు , 14 పార్లమెంట్ స్థానాల్లో మార్పు చేర్పులు చేపట్టారు.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి చాలా వరకు వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేశారు.దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే లు బహిరంగంగా తమ ఆవేదనను వెళ్లగక్కుతూ ఉండగా, మరి కొంతమంది సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు.అభ్యర్థులను మార్చిన చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలు , కొత్త ఇన్చార్జీలు సమన్వయంతో ముందుకు వెళ్లకపోవడం , దీనిపై అనేక వివాదాలు , గ్రూపు రాజకీయాలు వంటివి చోటు చేసుకోవడంతో, జగన్ చేపట్టిన మార్పు చేర్పులపై పార్టీ నేతల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది.
వీలైనంత త్వరగా అభ్యర్థులను మార్చి జనాల్లోకి వెళ్లే విధంగా జగన్ ప్లాన్ చేశారు. కొత్త ఇన్చార్జీలు పూర్తిగా జనాల్లో ఉంటూ ప్రజలకు దగ్గరయ్యే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.
సిద్ధం సభతో పార్టీ క్యాడర్ ను ఉత్సాహపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ప్రకటించిన ఆరు జాబితాలోని పేర్లను ఒకసారి పరిశీలిస్తే .
శాసనసభ :
గంగాధర నెల్లూరు నారాయణస్వామి( Narayanaswamy ), మైలవరం తిరుపతిరావు యాదవ్, మార్కాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, ఎమ్మిగనూరు బుట్టా రేణుక.

పార్లమెంట్ స్థానాలు :
రాజమండ్రి గూడూరి శ్రీనివాస్, గుంటూరు ఉమ్మా రెడ్డి రమణ, నరసాపురం గూడూరి ఉమా బాల, చిత్తూరు రెడ్డప్ప.