మరో చరిత్ర సినిమా చూసి ఎంత మంది ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారంటే?

ప్రేమ అనేది దేవుడు ప్రజలకు ఇచ్చిన అద్భుత వరం.ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది.

 How Many Lovers Have Committed Suicide After Watching Maro Charitra Movie , Maro-TeluguStop.com

ఎన్ని రకాల ప్రేమలు ఉన్నా అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమ అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది.అందుకే దర్శకులు ఎక్కువగా అమ్మాయి, అబ్బాయి తరహా ప్రేమ కథలను రకరకాల విధాల్లో ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే ఈ జానర్ లో ఎన్ని రకాల సినిమాలు వచ్చినా కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలలో చిర స్థాయిలో నిలిచిపోతాయి.అలాంటి కోవకే చెందింది కె.

బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మరో చరిత్ర సినిమా.కమల్ హాసన్ హీరోగా, మాధవి,అభిలాశలు హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా అప్పటి తరం కుర్రాళ్లను ఎంతలా ఆకట్టుకుందంటే యువతరం సృష్టించిన ప్రభంజనం వల్లే ఈ సినిమా ఘన విజయానికి కారణమని సినీ విశ్లేషకులు పలు సందర్భాలలో అభిప్రాయపడుతుంటారు.అయితే ఈ సినిమాలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకునే సన్నివేశం సినిమాకు ఒక ప్రధానకర్షనగా నిలువగా దురదృష్టకర విషయం ఏంటంటే మరో చరిత్రలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న విధానం చూసి ఎంతో మంది అలాగే మరణించడం అప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

అయితే ఈ ఘటనపై దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేసి సినిమా తీసినందుకు క్షమించమని కోరడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube