ఈ ద్రాక్ష పండ్లు ఒక్క గుత్తి ఇన్ని ల‌క్ష‌లా..?

ద్రాక్ష పండ్లు అంటే తెలియ‌ని వారు ఉండ‌రేమో.మ‌నం రెగ్యుల‌ర్‌గా తినే పండ్ల‌లో ద్రాక్ష‌కూడా ఉంటుంద‌ని తెల‌సిందే.

 How Many Lakhs Of A Bunch Of These Grapes Grapes, High Rates , Japan , 8.8 Lacs-TeluguStop.com

కాగా ఈ ద్రాక్ష పండ్లు ధర ఎంత ఉంటుందని అడిగితే ఏం చెప్ప‌తారు.హా ఎంత మ‌హా అయితే సీజన్ బట్టి రూ.100 నుంచి రూ.200 దాకా కిలో ఉంటుంద‌ని చెప్తారు క‌దా.కానీ అంత‌కంటే ఎక్కువ ధ‌ర ఉన్న ద్రాక్ష‌ను మీరెప్పుడైనా తిన్నారా అని అడిగితే మీ ఆన్స‌ర్ నో అనే వ‌స్తుంది క‌దా.ఎందుకంటే మ‌న‌కు ఇంత కంటే పెద్ద ధ‌ర‌లు ఉన్న ద్రాక్ష‌ల గురించి తెలియ‌దు.

కానీ ఇప్ప‌టి త‌రానికి త‌గ్గ‌ట్టు ప్ర‌తి విష‌యంలో కూడా దర్పం కనిపించేలా చూసుకుంటున్నారు చాలామంది.

దాంతో వారు తినే ఆహారం కూడా చాలా విలాసవంతమైనదిగా ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు బంగారం పూతతో చేస్తున్న వంట‌కాల‌ను కూడా చూస్తున్నాం.బిర్యానీతో పాటుగా ఐస్ క్రీం లేదంటే వడ పావ్ లాంటివి కూడా వేల‌కు వేలు ఉంటున్నాయ‌ని మ‌నం చూస్తున్నాం.

ఇక ఇప్పుడు కూడా ఓ ద్రాక్ష కూడా అత్యంత ఖ‌రీదైన‌దిగా గుర్తింపు పొందింది.ఒక్క ద్రాక్ష గుత్తి ముప్ప వేల‌కు పైగా ధర ఉంటోంది.

అయితే ఇది మ‌న ద‌గ్గ‌ర కాదండోయ్.జపాన్ దేశంలో రూబీ రోమన్ అనే కొత్త త‌ర‌హా ద్రాక్ష రకాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు.

Telugu Thousnad, Lacs, Graps, Grapes, Rates, Indial Currancy, Japan, Rubi Roaman

కాగా ఈ ర‌కం ద్రాక్ష గుత్తి మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.30 నుంచి 35 వేల దాకా ఉంటుంద‌ని చెబుతున్నారు నిపుణులు.ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ర‌కం ద్రాక్ష పండ్లు మ‌నం చూసే వాటిక‌న్నా నాలుగు రేట్లు పెద్ద సైజులో ఉంటాయ‌ట‌.ఇక దీని రంగు కూడా గులాబీ క‌ల‌ర్‌లో ఉంటాయ‌ని చెబుతున్నారు.

దాని రుచి కూడా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది.కేవ‌లం ఈ ద్రాక్ష పండ్లు జ‌పాన్‌లో మాత్ర‌మే పండిస్తారంట‌.అత్యంత అరుదుగా దొరకుతుండటంతో వీటికి అంత విలువ ఉంది.2020లో అయితే ఒక్క గుత్తికే ఏకంగా రూ.8.8 లక్షల‌కు అమ్ముడు పోయిదంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube