అందరికీ అండగా ఉండే ఆంజనేయుడి రూపాలెన్నో తెలుసా?

శ్రీరాముడి కార్యాన్ని సిద్ధింప జేసేందుకు దుష్టులను శిక్షించేందుకు, మంచి వాళ్లని కాపాడుతూ ధైర్యంగా ఉండేందుకు ఆ పరమ శివుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడని పరా శర సంహిత చెబుతోంది. అయితే ఆంజనేయ స్వామి వాయు దేవుడి అనుగ్రహం ద్వారా వానర వీరుడైన కేసరికి, ఆయన భార్య అంజనా దేవిలకు పుట్టాడు హనుమాన్.

 How Many Forms Of Anjaneyaswamy, Anjaneyaswamy , Devotional , Srirama , Ramayana-TeluguStop.com

 హనుమంతుడు బాలుడిగా ఉండగానే రుద్ర తేజంతో కనిపించేవాడట. అయితే ఆంజనేయ స్వామి సుగుణాలు రామాయణ మహా కావ్యంలో చక్కగా వర్ణించారు.

వీరత్వాన్ని, శూరత్వాన్ని, దయా గుణాన్ని వివరించారు. ఆంజనేయ స్వామికి మొత్తం తొమ్మిది రూపాలు ఉన్నాయట.

 కానీ ఆ అవతారాలు ఏంటో చాలా మందికి తెలియదు. అసలు హను మంతుడు అన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడో కూడా తెలీదు.

 అయితే రాముడి బంటుగా, ప్రజల్లోని భయాలను పారద్రోలే దివ్య శక్తిగా ఉన్న ఆంజనేయ స్వామి ఈ తొమ్మిది అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం .ఆంజనేయ స్వామి 9 రూపాల్లో మొదటిది వీరాంజనేయుడు. రెండోది ప్రసన్నాంజనేయుడు. మూడోది వింశతి భుజాంజనేయుడు.

 నాలుగోది అష్టా దశ భుజాంజనేయుడు, ఐదోది సువర్చలాంజనేయుడు, ఆరోది పంచ ముఖ ఆంజనేయుడు, ఏడోది చతుర్భుంజానేయుడు, ఎనిమిదోది ద్వాత్రింశద్భుజాంజనేయుడు, తొమ్మిదోది వానరాకార ఆంజనేయుడు. అయితే వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు.

 ఈ తొమ్మిది ఆంజనేయ స్వామి అవతారాలు హనుమన్నఅవతారాలుగా ప్రసిద్ధి పొందాయి. అయితే ఇందుకు సంబంధించిన విషయాలు, వివరణలు అన్నీ పరా శర సంహితలో  ఉన్నాయి.

How Many Forms Of Anjaneyaswamy, Anjaneyaswamy , Devotional , Srirama , Ramayanam, Prasannjanaya - Telugu Anjaneyaswamy, Devotional, Hanuman

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube