తెలంగాణ‌లో మాస్కులు లేని వారినుండి ఎన్ని కోట్ల జ‌రిమానా వసూలు చేశారంటే.. !

ప్రభుత్వాలు ఉన్నవే ప్రజల నుండి ముక్కుపిండి జరిమానాలను వసులు చేయడానికి అన్నట్లుగా ప్రస్తుతం పరిస్దితులు నెలకొన్నాయట.హెల్మెట్ లేదని ఫైన్, మాస్క్ లేదని ఫైన్.

 How Many Crores Of Fine Has Been Collected From Those Who Do Not Have Masks In T-TeluguStop.com

కానీ ఇలాంటి వారికి ఫైన్ వేయడం వల్ల వారిలో మార్పు కలుగుతుందా అంటే పూర్తి సమాధానం లభించదు.ముందుగా మాస్క్ లేని వారు కనిపిస్తే వారి డబ్బులతో ఒక మాస్క్ కొనిపించి పంపాలి, రెండో సారి కూడా అలాగే చిక్కితే కఠినంగా శిక్షించాలి అని కొందరు మేధావుల అభిప్రాయమట.

కానీ ఇక్కడ జరుగుతున్న ఘటన ఏంటంటే.జరిమానాలు విధించడం ముఖ్యం అనే తీరుగా సాగుతుందట వ్యవహారం.

ఇక మాస్కు లేదని వసూలు చేసిన డబ్బులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు మాస్కులు ధరించని వారి నుండి మొత్తం రూ.31 కోట్ల జ‌రిమానా వసూలు చేశామని అధికారులు వెల్లడించారు.ఇక నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు అవగా, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసులు, భౌతిక దూరం పాటించ‌నందుకు 22,560 కేసులు నమోదయ్యాయని వివ‌రించారు.

అయినా ప్రజలు కూడా వంద రూపాయలతో పోయే మాస్కు కు ఫైన్ రూపంలో వేయి రూపాయలు చెల్లించడం విడ్డూరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube