దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి ?  

  • సాధారణంగా ప్రతి ఒక్కరికి దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలనే విషయంలో సందేహం రావటం సహజమే. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2 వత్తులు లేదా 5 వత్తులు ఎన్ని అని సరే దానికి సమాధానం .5 వత్తులు ఉత్తమం అని పెద్దలు చెప్పుతూ ఉంటారు.

  • మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.

  • దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలనేది ఒక నియమం అని చెప్పవచ్చు. అయితే చాలా మంది 5 వత్తులను వేసి దీపారాధన చేస్తూ ఉంటారు.