కరోనా వల్ల రెండేళ్లలో ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలుసా?

గత ఏడాది కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా గడగడలాడించిందో చూసాం.గత ఏడాది మార్చి లో మన దేశంలో విజృంభించగా అలా కొన్ని నెలల వరకు విపరీతమైన కేసులతో, మరణాల సంఖ్య లతో తీవ్రమైన భయందోళనకు గురిచేసింది.

 How Many Coats Has The Industry Lost In Two Years Due To Corona, Corona, Industr-TeluguStop.com

ఇక ఆ సమయంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు కూడా కలుగగా సినీ ఇండస్ట్రీ కూడా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంది.అంతే కాకుండా కఠిన లాక్ డౌన్ కూడా విధించారు.

ఇక మొదటి వేవ్ కాస్త తగ్గుముఖం పట్టాక తిరిగి ఆరు నెలల వరకు అన్ని రంగాలు తెరుచుకున్నాయి.ఇక ఆ సమయంలో వాయిదా పడిన సినిమా షూటింగులు అన్ని మళ్లీ ప్రారంభం అవ్వగా వరుస సినిమాలతో థియేటర్లు తెగ సందడిగా మారాయి.

ఇక మళ్లీ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి.థియేటర్లు కూడా బంద్ చేశారు.దీంతో ఎన్నో వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా అన్ని వాయిదా పడ్డాయి.

Telugu Corona-Movie

దీంతో చాలా వరకు ఓటీటీ ద్వారా విడుదల చేశారు.చాలా వరకు ఈ ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి నష్టం ఎదురయ్యింది.ఈ రెండేళ్లలో సినీ ఇండస్ట్రీ బాగా నష్టపోగా దాదాపు రూ.750 కోట్లు నష్టపోయింది.ఇందులో గత ఏడాది రూ.500 కోట్ల నష్టం ఎదురవ్వడం తో ఈ ఏడాది రూ.250 కోట్లు నష్టపోయారు.ఇక తాజాగా లాక్ డౌన్ సడలింపుతో సినిమా షూటింగులు ప్రారంభం కానున్నాయి.పైగా సినిమా థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా బహుశా ఈ రెండు వారాలలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నాయి.ఇక ప్రేక్షకులకు కూడా సినిమాలు చూడటానికి బ్రేక్ రాగా దీంతో వరుస సినిమాల విడుదలతో తిరిగి ఇండస్ట్రీలు లాభాలు అందుకోనున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube