ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువ సినిమాలతో అలరించబోతున్న హీరోలు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా వారికంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవడానికి అనేక కష్టాలు పడుతూ ఉంటారు.ఈ తరుణంలో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు తీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 These Are The Heroes Who Are Going To Entertain With More Than One Movie This Year-TeluguStop.com

కానీ, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మాత్రం ఏ హీరో, ఏ హీరోయిన్ అయినా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.అదే ముందు తరం హీరోలు అయితే ఒక ఏడాదికి 5,6 సినిమాలు లేదు అంటే పది సినిమాల వరకు చేసిన హీరోలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఈ తరం హీరోల సినిమాలు ఎప్పుడు థియేటర్లలో వస్తాయా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.ఒక్కోసారి రెండు సంవత్సరాలు అయినా సరే వారి అభిమాన హీరోని స్క్రీన్ పై చూసుకోగలమా అని ఎంతోమంది వారి కోసం వేచి ఉంటారు.

 These Are The Heroes Who Are Going To Entertain With More Than One Movie This Year-ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువ సినిమాలతో అలరించబోతున్న హీరోలు వీళ్లే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మన హీరోలు స్క్రీన్ మీద కనపడడానికి కాస్త స్పీడ్ పెంచి సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇంకా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ తరుణంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సినిమాలతో అలరించనున్న హీరోల విషయానికి వస్తే.వారిలో రవితేజ, నితిన్ , రానా దగ్గుబాటి, శర్వానంద్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వెంకటేష్ ఉన్నారు.మాస్ మహారాజా రవితేజ క్రాక్ , కిలాడి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక నితిన్ చెక్, రంగ్ దే సినిమాలలో ఫిబ్రవరి మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు ఎందుకో సిద్ధమవుతున్నాడు.అలాగే వెంకటేష్ నారప్ప, F3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.

వరుణ్ తేజ్ గని, ఎఫ్3 సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక రానా దగ్గుబాటి విషయానికి వస్తే … అరణ్య , విరాటపర్వం, Pk Rana సినిమాతో స్క్రీన్ పై కనువిందు చేయబోతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలలో ఉంటూ మరోవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.ఇక ఈ సంవత్సరం వకీల్ సాబ్, Pk Rana అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతున్నాడు.

#Nitin #Raviteja #In This Year #MoreThan #Rana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు