ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది.టికెట్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ‘అడుక్కోవద్దు.
అది మన హక్కు’ అంటూ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఆయన హితబోధ చేశారు.
ఇదిలా ఉండగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి మోహన్ బాబు ఏపీ సీఎం జగన్ కు బంధువు అని చెప్పుకుంటూనే ఈ విషయంపై ఎందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ బహిరంగంగా మోహన్ బాబును ప్రశ్నించారు.
ఇక ఈ విషయంపై మోహన్ బాబు స్పందిస్తూ ప్రస్తుతం నా కొడుకు మా ఎన్నికలలో నిలబడ్డాడు ఈ ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ప్రశ్నకు సమాధానం చెబుతానని అప్పుడు మాట దాటవేశారు.అయితే మా ఎన్నికలు ముగిసి సుమారు మూడు నెలల అవుతున్నప్పటికీ ఈ విషయం గురించి మోహన్ బాబు ఎక్కడా ప్రస్తావించలేదు.

ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని మోహన్ బాబు ఆదివారం సినిమా టికెట్ల విషయంపై బహిరంగ లేఖ రాశారు.అందరం కలిసి సినిమా సమస్యలపై చర్చలు జరిపి అనంతరం ఈ సమస్యలను పరిష్కరించడానికి పోరాడుదాం అంటూ మోహన్ బాబు ఒక లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఈ క్రమంలోని ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇవ్వడానికి మోహన్ బాబుకి ఇంత సమయం పట్టిందా.అంటూ మోహన్ బాబు లేక పై కామెంట్లు చేస్తున్నారు.