ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎలా కనిపించబోతున్నాడంటే..?!

హైదరాబాద్ అంటే అదో మహానగరం.విశ్వనగరంగా పేరుగాంచిన ఈ హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

 How Is Khairatabad Ganesha Going To Look This Time, Khairatabad Ganesh, 2021, 40-TeluguStop.com

హైదరాబాద్ కు ప్రత్యేకత మరోకటి ఏంటంటే వరల్డ్ ఫేమస్ ఖైరతాబాద్ గణేశ్ కు ఇదే వేదిక కూడా.ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి.

ఎన్నో రకాల ప్రతిమలు హైదరాబాద్ లో వెలుస్తాయి.ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుంది.

ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవారికి సంబంధించి ఓ ప్రకటన వచ్చింది.ఖైరతాబాద్‌ భారీ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా అందర్నీ కనువిందు చేయనున్నారు.

గణేశ్ ప్రతిమకు ముందు వైపున నందీశ్వరుడు, గరుఖ్మంతుడు ఆయన్ని ప్రార్థిస్తున్నట్లుగా తిష్ట వేసుంటారు.వినాయకస్వామికి వెనక వైపుగా చూసినట్లైతే ఒకవైపు సింహం ఉంటుంది.

అలాగే మరో వైపుగా గుర్రం కూడా ఉంటుంది.ఇకపోతే భారీ వినాయకస్వామిని ఏర్పాటు చేసిన మంటపంలో ఒక వైపు చూస్తే కాళీదేవి అవతారంలో కృష్ణుడిని ఆరాధిస్తున్న రాధ ఉంటుంది.

ఇంకోవైపుగా నాగదేవత విగ్రహాలు అనేవి ఉంటాయి.

Telugu Feet, Idol, Maha Ganapathi-Latest News - Telugu

ఖైరతాబాద్ గణేశ్ 2021 ఉత్సవానికి సంబంధించి ఓ కీలక ప్రకటన అనేది వెలువడింది.ఖైరతాబాద్ వినాయ స్వామిని ఈసారి ఎలా ఏర్పాటు చేయనున్నారో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ మెంబర్లు శనివారం నమూనా పటాన్ని వెల్లడించారు.కరోనా వల్ల ఈ సంవత్సరం 40 అడుగులలో వినాయకస్వామిని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఈసారి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉత్సవాలను నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో ఉన్నటువంటి ఆ నమూనాను ఎస్.అన్బరాసన్ డిజైన్ చేశారు.అలాగే శిల్పి సి.రాజేంద్రన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలియజేసింది.సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు జరగనున్నాయి.

ఇందుకు సంబంధించి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఓ ప్రకటన వెలువడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube