డిఫెన్స్, క్వాడ్, కోవిడ్, ఇమ్మిగ్రేషన్ : గత రెండేళ్లలో భారత్-అమెరికా సంబంధాలు చూస్తే... సమగ్ర విశ్లేషణ

గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.

 Defence, Quad, Covid, Immigration : How India-us Ties Have Evolved In Last Two Y-TeluguStop.com

కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్‌లు భారత్‌తో సంబంధాలు మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు.

ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం భారత్-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోంది.కరోనా సంక్షోభం, అమెరికాలో అధికార మార్పు వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాల్లో ఎప్పటికప్పుడు కొత్త కోణాలను జోడిస్తున్నాయి.

ఈ క్రమంలో గడిచిన రెండేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.

భారత్- అమెరికాలు గత కొన్నేళ్లుగా ముఖ్యమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

ఇదే సమయంలో ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనాకు ధీటైన బదులిచ్చేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు క్వాడ్ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.వాస్తవానికి ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణవాదానికి అడ్డుకట్టే వేసే శక్తిగా భారత్‌ను అమెరికా చూస్తోంది.డొఖ్లాం , గల్వాన్ వివాదాల సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలబడింది.2020 నవంబర్‌లో మలబార్ సైనిక విన్యాసాలతో భారత్- అమెరికాల వ్యూహాత్మక సంబంధాలు మరో మెట్టుపైకెక్కాయి.గడిచిన 13 ఏళ్లలో తొలిసారిగా నాలుగు క్వాడ్ సభ్యదేశాల నావికా దళాలు కలిసి నిర్వహించిన ఈ విన్యాసాలు చైనాకు హెచ్చరికలాంటివని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

అలాగే భారత్‌కు రక్షణరంగ అవసరాల్లో అమెరికా మరింత తోడ్పాటును అందిస్తోంది.

దీనిలో భాగంగానే ఆఫ్రికాలోని జిబౌటి నుంచి పసిఫిక్‌లోని గువామ్ వరకు వున్న సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశాన్ని భారత్‌కు అమెరికా ఇచ్చింది.అలాగే యూఎస్ రక్షణ పరికరాలలో ఉపయోగించే అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీని యాక్సెస్ చేసే వెసులుబాటు కల్పించింది.

అధికారిక సమాచారం ప్రకారం.డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వున్న చివరి ఏడాదిలో అమెరికా నుంచి భారత్‌ ఆయుధ దిగుమతులు 6.2 మిలియన్ డాలర్ల నుంచి 3.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

Telugu Covid, India Evolved, India, Quad-Telugu NRI

అమెరికాలోని విద్య, ఆరోగ్య సంరక్షణ, వాణిజ్యం, రాజకీయాల్లో దూసుకెళ్తున్న భారతీయ ప్రవాసులు గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరచడానికి కారణమయ్యారు.భారత మూలాలున్న కమలా హారిస్ ఇప్పుడు అమెరికాకు ఉపాధ్యక్షురాలు.దీనికి తోడు అధ్యక్షుడు జో బైడెన్ తన అధికార యంత్రాంగంలో అనేక మంది ఇండో అమెరికన్లకు కీలక పదవుల్ని కట్టబెట్టారు.అంతేకాకుండా 2019లో టెక్సాస్‌లో జరిగిన హౌడీ మోడీ, 2020లో అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలు ప్రపంచ వేదికపై భారత్- అమెరికా సంబంధాలను రుజువుచేశాయి.

Telugu Covid, India Evolved, India, Quad-Telugu NRI

ఇకపోతే భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ సహా పలు ఇమ్మిగ్రెంట్ వీసాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.2020 ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన ట్రంప్‌తో ఈ విషయంపై భారత ప్రభుత్వ అధినాయకత్వం చర్చించింది.అనంతరం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్.ట్రంప్ హయాంలో వున్న నిషేధాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు.కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్- అమెరికా సంబంధాల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి.గతేడాది కరోనాతో అమెరికా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ పెద్ద మనసుతో ముఖ్చమైన వైద్య సామాగ్రిని అందజేసింది.

అలాగే అమెరికాకు వైద్య సంబంధిత ఎగుమతుల విషయంలో వున్న పరిమితులను సైతం సడలించింది.అయితే ఈ ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్‌తో భారత్ అల్లాడిపోతున్న దశలో అమెరికా సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు.

బైడెన్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానాన్ని సొంత ప్రజలతో పాటు ప్రపంచదేశాలు ఖండించాయి.ఆ తర్వాత తన మనసు మార్చుకున్న బైడెన్.

భారత్‌కు అవసరమైన సాయాన్ని అందించారు.మొత్తం మీద భారత్- అమెరికా సంబంధాలు మంచిగానే సాగుతున్నట్లుగా అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube