ఒక గ్రాము తేనె త‌యారీకి తేనెటీగ‌లు ఎంత క‌ష్ట‌ప‌డ‌తాయె తెలిస్తే షాక‌వుతారు

భూమిపై ఉన్న తేనెటీగలు కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా తేనెను తయారు చేయడానికి ఎడ‌తెగ‌ని కృషి చేస్తున్నాయి.తేనెలో వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

 Bees Travel Around 195 Kms To Make 1-gram Of Honey, Honey Bees, Making Honey, Tr-TeluguStop.com

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.భూమిపై 20 వేల కంటే ఎక్కువ జాతుల తేనెటీగలు ఉన్నాయి, వాటిలో కేవలం 5 జాతుల తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి.

ఒక తేనెప‌ట్టులో దాదాపు 50 వేల తేనెటీగలు ఉంటాయి.అందులో వేలాది ఆడ తేనెటీగలు నివసిస్తాయి.

Telugu Honey Bees, Honey, Travel Distance-Latest News - Telugu

వందల సంఖ్యలో మగ తేనెటీగలు (డ్రోన్లు), ఒక రాణి తేనెటీగ ఉంటాయి.అందులో నివశించే ఆడ తేనెటీగలు తేనెను తయారు చేస్తాయి.మగ తేనెటీగలు రాణి తేనెటీగతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మాత్రమే ఉంటాయి.ఒక తేనెటీగ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు.ఇది సెకనులో 200 సార్లు రెక్కలు విప్పుతుంది.తేనెటీగల వాసన మానవుల కంటే ఎక్కువ.

ఒక తేనెటీగ తన జీవితంలో ఒక చెంచా తేనెలో 12వ వంతు మాత్రమే త‌యారు చేయగలదు.తేనెటీగలు ఒక పౌండ్ (454 గ్రాములు) తేనెను తయారు చేయడానికి 55 వేల మైళ్ల (88514 కిలోమీటర్లు) దూరం ప్రయాణిస్తాయి.

తేనెటీగ

జీవితకాలం గరిష్టంగా ఒక నెల.రాణి తేనెటీగ‌ చాలా సంవత్సరాల పాటు జీవిస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube