ప్లాస్టిక్ విష‌యంలో ఈ చిన్నారికి ఉన్న అవ‌గాహ‌న అంద‌రికీ ఉంటే ఎంత బాగుండు..!

ప్లాస్టిక్ పై ఎన్ని అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వహించిన ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం చేస్తారు.ప్ర‌భుత్వం రంగంలోకి దిగి జ‌రిమానాలు విధించినా జ‌నాలు మార‌రు.

 How Good It Would Be If Everyone Had This Kid Understanding Of Plastic, Plastic,-TeluguStop.com

నెత్తి నోరు కొట్ట‌కున్నా కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని ఏమాత్రం త‌గ్గించ‌రు.కానీ ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కోసం ఎనిమిది ఏండ్ల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది.

ఏకంగా సముద్ర గర్భంలో.ప్లాస్టిక్‌ నిషేధం కోసం ఎనిమిది సంవత్సరాల ఓ బాలిక వినూత్నఅవ‌గాహ‌న ఏర్పాటు చేసింది.

ప్లాస్టిక్‌ వాడకం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియ‌ప‌రిచేందుకు ప్ర‌పంచంలో ఎవరూ చేయ‌న‌టువంటి సాహసం చేసింది.భూమి మీద కాకుండా ఏకంగా సముద్ర గర్భంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించి సాహ‌స బాలిక అనిపించుకుంది.

వివరాల్లోకెళితే.పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన తారగై ఆరాధనకు 8 సంవ‌త్స‌రాలు.తన తండ్రి ప్రోత్సాహంతో స్కూబింగ్ నేర్చుకుంది.అయితే తాను నేర్చుకున్న విద్యతో ఏదైనా ఒక వినూత్న సాహ‌సం చేయ‌ల‌న‌కుంది.

అనుకోవ‌డ‌మే ఆల‌స్యం ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై, పాండిచ్చేరిలో ఉన్న సముద్రంలో అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని నిర్ణ‌యించుకుంది.

Telugu Plastic, Chennai Sea, Pondichery-Latest News - Telugu

ఈ విషయాన్ని ఆరాధన తన తండ్రికి కులంక‌షంగా చెప్పింది.అతను కూడా తన బిడ్డ నిర్ణయాన్ని మెచ్చుకుని మ‌ద్ద‌తు తెలిపాడు.అంతేగాకుండా ఆమెకు అండగా నిలిచాడు.

ఈ క్రమంలో బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొల‌గించింది.దాంతో పాటు సముద్రం లోపల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను కొన్ని కొన్నింటిని తొలగిస్తూ వచ్చింది.

ఆరాధన చేసిన ఈ ప్రయత్నాలను వీడియో తీసి త‌న తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.పోస్ట్ చేయ‌డ‌మే ఆల‌స్యం ఆ వీడియోలు కాస్తా వైరల్ అయ్యాయి.

ప్లాస్టిక్ నిషేధంపై ఆరాధన చేస్తున్న ప్ర‌యోగానికి ఆమెను అందురూ మెచ్చుకుంటున్నారు.అంతేగాకుండా నెటిజన్లు ఆ చిన్నారిపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube