మామూలుగా అందరూ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే నెల నెల కొంత డబ్బులు దాస్తు డబ్బుని పొదుపు చేస్తుంటారు.అయితే ఇందులో ఎక్కువగా కొంతమంది ఇన్స్టంట్ డబ్బు కోసం పొదుపు చేస్తూ ఉంటారు.
మరికొందరైతే ఏకంగా ఎప్పుడో భవిష్యత్తులో పదేళ్ళ తర్వాతనో, 20 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి తమ పిల్లల చదువులు, పెళ్లి లేదా ఇతర కారణాల దృష్ట్యా డబ్బులు దాస్తుంటారు.అయితే ఇలాంటి వారి కోసం పిఎఫ్ఎఫ్ సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది.
ఎలాగంటే నెలకి కేవలం ఐదు వేల రూపాయలు పిఎఫ్ఎఫ్ ఖాతాలో 35 సంవత్సరాల కాలం పాటు జమ చేస్తే దాదాపుగా కోటి రూపాయలు మదుపరులకు తిరిగి చెల్లిస్తారు.అంటే నెలకు 5000 అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు అన్నమాట.అయితే మదుపరులు జమచేసిన డబ్బుకి సంస్థ 7.9 శాతం వడ్డీని చెలిస్తారు.ఈ లెక్కన 35 సంవత్సరాలు కోటి రూపాయలు పొదుపు చేసిన వ్యక్తికి చెల్లిస్తారు.అయితే ఇది 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు వారికి మాత్రమే.

అయితే 30 సంవత్సరాలు పైబడిన అటువంటి వారు కూడా ఈ స్కీమ్ కి అర్హులే.కానీ 30 సంవత్సరాలు పైబడిన అటువంటి వారు నెల నెల 7,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇందుకుగాను కూడా పిఎఫ్ సంస్థ అధికారులు పొదుపు చేసినటువంటి డబ్బుకి 8 శాతం వడ్డీ చెల్లిస్తూ దాదాపుగా కోటి రూపాయలు చెల్లిస్తారు.అయితే ఇక్కడ కోటి రూపాయల కంటే ఎక్కువ కావాలనుకునేవారు సంవత్సరానికి 1.5 లక్షలు చెల్లిస్తే దాదాపుగా 35 సంవత్సరాల తర్వాత 1.8 కోట్ల రూపాయలు పొందవచ్చు.
.