జియో 5జీ స్పీడ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

2022లో ఇండియాలో 5జీ నెట్‌వర్క్ సేవలు రావొచ్చని ఇప్పటికే ప్రముఖ టెక్ వర్గాలు ప్రకటించాయి.అయితే ఇది ఒక పైలెట్ ప్రాజెక్టుగా భారతదేశంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 How Do You The Speed Of Jio 5g Speed ,  Jio 5g , Speed , Technology Updates , La-TeluguStop.com

మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి 13 మెయిన్ సిటీలలో 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమవుతాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ కూడా వెల్లడించింది.అన్ని టెలికాం సంస్థల కంటే రిలయన్స్ జియోనే ముందుగా 5జీ నెట్‌వర్క్ ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.మౌలిక సదుపాయాల విషయంలో కూడా జియో ముందుంది.5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఇప్పటికే అన్ని రెడీ చేసుకుంటోంది.5జీ ట్రయల్స్‌ను కూడా ప్రస్తుతం చేపడుతోంది.ఈ క్రమంలో రిలయన్స్ జియో 5జీ ట్రయల్స్‌కు ఒక ఆసక్తికరమైన వార్త లీక్ అయ్యింది.

అదేంటంటే, రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 420Mbps నమోదు చేసింది.అంటే ఇప్పుడు 4జీ నెట్‌వర్క్ కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ స్పీడ్ అని అర్థం.అంతేకాదు జియో 5జీ నెట్‌వర్క్ అప్‌లోడ్ స్పీడ్ 412Mbps దాటిందని ప్రముఖ టెక్ వెబ్‌సైట్ వెల్లడించింది.4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఇది 15రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు.ఈ డౌన్‌లోడ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉండటంతో ఒక సినిమా అనేది కేవలం పది సెకండ్లలోనే డౌన్‌లోడ్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ స్పీడ్ టెస్ట్ అనేది ముంబై నగరంలో జరిగింది.5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాగానే హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌ రంగాలు బాగా లాభపడతాయి.అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే.4జీ ప్లాన్‌లతో పోలిస్తే 5జీ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు కాస్త ఎక్కువగా ఉండొచ్చు.ఆరంభంలో మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే 5జీ సేవలు ఆఫర్ చేసే అవకాశం ఉండొచ్చు.

నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత, 5జీ వేగం పూర్తిస్థాయిలో పెరిగిన తర్వాత ధరలు మరింత ఎక్కువ కావచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Reliance Jio 5g Speed Test Details Leaked Reliance Jio 5G speed

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube