కొత్త ఇంటిని ఎలా కొన్నావ్.... నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పిన దీప్తి సునయన!

దీప్తి సునయన పరిచయం అవసరం లేని పేరు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ప్రవేట్ ఆల్బమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

 How Did You Buy A New Home Deepti Sunaina Strong Reply To Netizen Question Detai-TeluguStop.com

అయితే ఈయన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో సిరితో చనువుగా ఉండడంతో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ పడింది.

Telugu Biggboss, Deepti Sunaina, Deeptisunaina, Netizen-Movie

ఇలా షన్నూతో బ్రేకప్ అయినప్పటికీ ఈమె ఏమాత్రం ఒంటరిగా ఫీల్ అవ్వకుండా తన స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు.అలాగే ప్రస్తుతం దీప్తి సునయన ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా తన కెరియర్ లో బిజీగా ఉన్న దీప్తి సునయన తాజాగా హైదరాబాద్లో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

Telugu Biggboss, Deepti Sunaina, Deeptisunaina, Netizen-Movie

ఈ క్రమంలోనే నేటిజన్స్ వివిధ రకాల ప్రశ్నలను వేస్తూ తన నుంచి సమాధానాలను రాబట్టారు.ఈ క్రమంలోనే ఒక అభిమాని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యావా అని ప్రశ్నించడంతో అవును అంటూ సమాధానం చెప్పారు.మరొక నెటిజన్ చెన్నై ఎప్పుడు వస్తున్నారు అని ప్రశ్నించగా ఈ నెలలోనే తాను చెన్నై వస్తున్నానని దీప్తి సమాధానం చెప్పారు.అయితే ఓ నెటిజన్ మాత్రం హైదరాబాదులో ఇల్లు ఎలా కొనుక్కున్నావ్ అంటూ ప్రశ్నించారు…ఈ ప్రశ్నకు దీప్తి సమాధానం చెబుతూ తాను సంపాదించిన దానిలో 30% ఖర్చు చేసే 70% కూడబెట్టి తన సొంత డబ్బుతోనే ఇల్లు కొనుగోలు చేశానని చెబుతూ తన నోరు మూయించారు.

ఇలా దీప్తి సునయన చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube