తిరుమలలో మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో తరచు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు.ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామివారిని వివిధ అలంకరణలో అలంకరించి వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఉరేగిస్తూ ఉంటారు.

 How Did The Streets Of Thirumala Get Their Name-TeluguStop.com

అయితే ఇప్పటివరకు మాడవీధులు అనే పేరు వినే ఉంటాం కానీ అసలు ఈ మాడవీధులు అంటే ఏమిటి? ఈమాడ వీధులకు ఏ విధంగా ఆ పేరు వచ్చాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.అయితే తిరుమల మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

తిరుమలలోని శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు వైపుల ఉన్న ప్రధాన రహదారులనే మాడ వీధులు అంటారు.తమిళంలో ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారుల పక్కన అర్చకులు నివసించడానికి ఉండే ఇళ్ళను మాడం అని పిలిచేవారు.

 How Did The Streets Of Thirumala Get Their Name-తిరుమలలో మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పేరే క్రమంగా మాడవీధులుగా మారింది.నాలుగు దిక్కులలో ఉన్న ఈ ఈ రహదారులను తూర్పు మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, దక్షిణ మాడ వీధి అనే పేర్లతో పిలుస్తారు.

Telugu Brahmotsavalu, Madam, Sri Venkateswara Swamy, Tirumala Streets-Telugu Bhakthi

పూర్వం శ్రీవారి ఆలయం చుట్టూ ఈ విధమైనటువంటి రహదారులు లేకపోవడంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ధ్వజారోహణ చేసి మిగతా కార్యక్రమాలను తిరుచానూరులో చేసేవారు.శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారులను వెడల్పు చేసి వాటిని మాడవీధులుగా ఏర్పాటు చేశారు.ఈ విధంగా అప్పటి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపినప్పుడు ఈ నాలుగు మాడ వీధుల వెంట స్వామివారిని మిగతా వాహనాలపై వివిధ అలంకరణలో ఊరేగిస్తారు.

#SriVenkateswara #Madam #Brahmotsavalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU