సిరివెన్నెల సీతారామశాస్త్రికి సిరివెన్నెల పేరు ఎలా వచ్చింది?

How Did Sirivennela Sitaramashastri Get The Sirivennela Name

కొందరి మహానుభావులకు తమ సొంత పేరు కంటే తమకు మధ్యలో ఓ గుర్తింపు తో వచ్చిన పేరు మాత్రమే చివరి వరకు మిగిలిపోతుంది.ఎందుకంటే ఆ గుర్తింపు అనేది వాళ్లకు మరో కొత్త జీవితాన్ని అందించినట్టే.

 How Did Sirivennela Sitaramashastri Get The Sirivennela Name-TeluguStop.com

అలా సినీ ప్రముఖులు చాలామంది తమ సొంత పేర్లు కంటే తమకు వచ్చిన గుర్తింపు తోనే తమ పేరును పెట్టుకున్నారు.అలా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా తన పేరును తనకు వచ్చిన గుర్తింపు తోనే సంపాదించుకున్నారు.

ఇంతకు ఈయనకు ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 How Did Sirivennela Sitaramashastri Get The Sirivennela Name-సిరివెన్నెల సీతారామశాస్త్రికి సిరివెన్నెల పేరు ఎలా వచ్చింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సిని ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా కొనసాగి తను రాసిన పాటలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

ఈయన సినీ గీత రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఈ తరం వరకు ఈయన పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.నిజానికి ఈయన రాసిన పాటలు వింటే మాత్రం ఇంత అద్భుతమైన రచయిత మన తెలుగు వారైనందుకు ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిందే.

ఇక ఈయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి.

ఈయన 1955 లో మే 20న అనకాపల్లి గ్రామంలో జన్మించారు.ఈయన వయసు 66 సంవత్సరాలు.

ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే గొప్ప పేరు వచ్చింది.ఇంతకు ఈయనకు ఈ పేరు రావటానికి అసలు కారణం ఏమిటంటే.

ఈయన తొలిసారిగా 1986లో సిరివెన్నెల సినిమాతో గేయ రచయితగా పరిచయమయ్యారు.

Telugu Cancer, Vishwanath, Lyricist, Music, Sirivennela, Tollywood-Movie

నిజానికి ఈయనను సిరివెన్నెల సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ సినిమాతోనే గేయ రచయితగా పరిచయం చేశారు.దీంతో సీతారామశాస్త్రి ఇందులో అన్ని పాటలను అందించారు.

అందులో మొదట ‘విధాత తలపున ప్రభవించినది’ అనే పాటను రచించారు.ఈ పాట అప్పట్లో ఎంత మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుందో.

ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Cancer, Vishwanath, Lyricist, Music, Sirivennela, Tollywood-Movie

అలా ఈ సినిమాలో అన్ని పాటలను అందించినందుకు తనకు ఈ సినిమా నుండి మంచి గుర్తింపు వచ్చింది.దీంతో ఆయనకు సినిమా పేరు అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే పేరు వచ్చింది.ఆ తర్వాత ఆయన ఇప్పటివరకు ఎన్నో పాటలను అందించారు.

ఇప్పటివరకు ఒక్క పాట కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదు.ఎందుకంటే ఆయన అందించిన పాటలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి.

Telugu Cancer, Vishwanath, Lyricist, Music, Sirivennela, Tollywood-Movie

మళ్లీ మళ్లీ వినిపించే పాటలు అందించిన ఆయన ఇప్పుడు తన పాటల రచనకు ముగింపు పలికారు.ఇకపై ఆయన పాటలు మనకు వెతికిన దొరకవు.ఈయన గత కొన్ని రోజుల నుండి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఈరోజు (నవంబర్ 30) కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఈ లోకం నుంచి అనంత లోకాలకు వెళ్లిపోయారు.ఎంతోమంది అభిమానుల హృదయాల్లో తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చారు.

ఇటువంటి గేయ రచయిత ఇక మళ్లీ రాలేరేమో అని బాధపడుతున్నారు.

#Sirivennela #Vishwanath #Sirivennela #Lyricist #Sirivennela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube