వీరుష్క లు మొదటిసారి కలిసినప్పుడు కోహ్లీ ఎలా స్పందించాడంటే..?!

సినిమాలంటే అందరికీ ఇష్టం.క్రికెట్ అంటే కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం.

 How Did Kohli React When The Veerushkas First Met-TeluguStop.com

మరి ఆ రెండు రంగాలు ఒక్కటైతే.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ సెలబ్రిటీ అనుష్క ఇద్దరూ కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది.అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్న సందర్భంలో చాలా మంది వీరిని చూసి కుళ్లుకునేవారు.

 How Did Kohli React When The Veerushkas First Met-వీరుష్క లు మొదటిసారి కలిసినప్పుడు కోహ్లీ ఎలా స్పందించాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరూ వీరి గురించే చర్చించుకునేవారు.వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కింది.2017వ సంవత్సరంలో డిసెంబరు నెలలో వీరు పెళ్లి చేసుకున్నారు.ఈ మధ్య కాలంలో ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది.

విరాట్, అనుష్క తమ పాపాయికి వామిక అనే పేరు పెట్టారు.గతంలో ఇంగ్లాండ్‌ లో జరుగుతున్నటువంటి ఓ టెస్ట్ మ్యాచ్ కు ముందుగా క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కొంచెం కంటతడి పెట్టారు.

తన పాపాయిని ఎత్తుకోవడానికి తన తండ్రి లేకుండా పోయాడని ఎమోషనల్ అయ్యాడు.

కోహ్లీ నాన్న ప్రేమ్ కోహ్లీ 2006వ సంవత్సరంలో గుండెపోటుతో కన్నుమూశారు.

విరాట్ విజయాన్ని, కూతురిని చూడటానికి తన తండ్రి లేకపోవడం బాధాకరమైని కంటతడి పెట్టాడు.ఇప్పుడు తన కూతురు వామికతో తన తల్లి ఎంతో సంతోషంగా గడుపుతోందని తెలిపాడు.

మొదటి సారిగా అనుష్క శర్మను కలిసినప్పుడు ఎంతో సరదాగా మాట్లాడినట్లు తెలిపాడు.

ఆ టైంలో అనుష్క కొంచెం సీరియస్ అయినట్లు తెలిపాడు.2013వ సంవత్సరంలో ఓ షాంపూ యాడ్ చేసే సయమంలో ఆమెతో ప్రేమలో పడినట్లు తెలిపాడు.మొదటిసారి అనుష్క కనిపించగానే ఆమె హైహీల్స్ చెప్పులు వేసుకుని ఉంది.

ఆ టైంలో అంత కంటే ఎత్తు చెప్పులు దొరకలేదా అని అనుష్కతో జోక్ వేసినట్లు తెలిపాడు.ఆ టైంలో అనుష్క కోపంగా తనకు బదులిచ్చిందని తెలిపాడు.తానేమి ఆరడుగులు లేనని చెప్పి గట్టిగా బదులిచ్చిందని తెలిపాడు.ఆ విధంగా అనుష్క శర్మతో తొలిసారి బుక్కయ్యానని తన మనసులో మాటలను బయట పెట్టాడు.

#Anushka Sharma #Virat Kohili

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు