తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ఒక సినిమా చేయాలి అనుకుంటే, అది ఆయన కాకుండా వేరే హీరో చేసి మంచి విజయాన్ని కూడా అందుకుంటూ ఉంటారు అయితే అలాంటి ఒక సినిమానే రాక్షసుడు( Rakshasudu )… ఈ సినిమా మొదటిగా తమిళంలో వచ్చి మంచి విజయం అందుకుంది.
ఇక ఈ సినిమాని మొదట నితిన్( Nithiin ) రీమేక్ చేద్దాం అనుకున్నాడు, కానీ అంతకుముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Sreenivas ) ఈ సినిమాని చేయాలని ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవాలి చూసాడు దానికి కొంత వరకు ఆ ప్రొడ్యూసర్ నిరాకరించినప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాళ్ల డాడీ అయిన బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) ఇన్వాల్వ్ మెంట్ తో ఆ సినిమా రైట్స్ ని వీళ్ళు దక్కించుకోవడం జరిగింది.అయితే ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకుడుగా చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతూ ఈ సినిమా చూసే ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని పంచుతుంది.
నిజంగా ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి నటన ని కనబరచాడు.ఈ సినిమాతో శ్రీనివాస్ ఆయన కెరియర్ కి మొదటి కమర్షియల్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు.ఇక ఈ సినిమాకి కలక్షన్స్ కూడా విపరీతంగా రావడంతో ఈ సినిమాకి అది మరొక అడ్వాంటేజ్ అనే చెప్పాలి.
ఈ సినిమా తమిళంలో వచ్చిన సినిమాకి ఏమాత్రం తగ్గకుండా తెలుగులో భారీ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇక వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ సినిమాని అభిమనిస్తు ఉంటారు.ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న స్టోరీ కాబట్టి ఈ స్టోరీ అందరికీ బాగా కనెక్ట్ అయింది…
.