తన భర్త డైరీ తో భార్య జీవితం ఎలా మారిపోయిందంటే...!?

రాజభోగాలతో విలాసవంతమైన జీవితం గడిపే ఒక స్త్రీకి అనుకోని సంఘటనల వలన, విధి వక్రించిడంతో ఆమె జీవితము అనేక మలుపులు తిరిగింది.ఇక అసలు విషయం లోకి వెళితే… లుమెయ్ అనే ఒక స్త్రీకి 3 సంవత్సరముల క్రిందట ఒక వ్యక్తి తో వివాహము జరిగింది.

 Dairy, Husband, Wife, Heart Attack, Died, Company, Help, Wife Life Changes After-TeluguStop.com

ఈ మూడు సంవత్సరములలో ఆమె ఏ కష్టము ఎరుగకుండా, బాధ అంటే ఏమిటో తెలియకుండా ఆమె భర్త ఆమెను అంత ప్రేమగా చూసుకున్నాడు.ఈ మూడు సంవత్సరాల కాలంలో వారికి సంతానం కూడా కలిగింది.

ఇలా సాఫీగా సాగుతున్న ఆ సంసారం లో ఒక అనుకోని సంగటన జరిగింది.అది ఏమిటంటే… ఆమె భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు.

దింతో ఆమె పూర్తిగా దుఃఖం లో మునిగిపోయింది.

ఎంతో ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడంతో ఆమెకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

చాలా రోజుల వరకూ ఆమె తిరిగి మామూలు మనిషి కాలేక పోయింది.ప్రతి క్షణము భర్తనే తలుచుకుంటూ దుఃఖించేది.సరిగ్గా అన్నం తినక నిద్రపోకుండా ఉండేది.లుమెయ్ పెళ్ల‌య్యాక త‌న భ‌ర్త‌తో క‌లిసి ప్యాలెస్‌లో ఉంటుండేది.

అందులో ఎన్నో గదులు ఉండేవి.ఆ ప్యాలెస్ కు దగ్గరలో ఓ స్కూల్ ఉండ‌డంతో అందులో చ‌దివే ఎంతోమంది విద్యార్థులు ఆ ప్యాలెస్‌లో గ‌దుల‌ను అద్దెకు తీసుకుని చదువుకొనే వారు.

ఆ పిల్లలకు ఈ భార్యాభర్తలు ప్రతిరోజు భోజనము పెట్టేవారు.అలాగే పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకునేవారు.

కానీ, లుమెయ్ తన భర్త చనిపోయిన తరువాత ఒంటరి అయిపోయింది.దానికి తోడు ఆమె మరిది ఆ ప్యాలెస్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి, ఆమెను ఆ ప్యాలెస్ నుంచి బయటికి పంపించాడు.

ఆమెను బయటికి పంపుతున్న కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరు అభ్యంతరం చెప్పలేదు.దానితో ఆమె దిక్కులేని అనాధగా మారింది.

దింతో తన బిడ్డను తీసుకుని బయటకు వెళ్ళింది.

Telugu Company, Dairy, Heart Attack-

ఇక ఆ తరువాత ఆమె ఒక చిన్న గదిని బాడుగకు తీసుకుని, బతకడానికి స్కూలు ఆవరణం నందు ఒక చిన్న పండ్ల దుకాణము పెట్టుకుంది.ఒకరోజు ఇద్దరూ తెలియని వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చి నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.మరుసటి రోజు తమ కంపెనీకి రావలసినదిగా అడ్రస్ ఇచ్చి వెళ్లారు.

మరుసటి రోజు ఆమె కంపెనీకి వెళ్లగా వారు ఆమెను రాజ మర్యాదలతో స్వాగతం పలికారు.కంపెనీలో మంచి ఉద్యోగం ఇచ్చారు.

ఆమెకు ఇదంతా చాలా వింతగా అనిపించింది.ఇక ఆ కంపెనీ పేరు ఎప్పుడో విన్నట్లుగా అనిపించి తన భర్త యొక్క డైరీ వెతుకగా అందులో కనిపించింది.

తన భర్త డైరీలో రాసుకున్న ఎన్నో మంచి విషయాలను చదివి ఆనందించింది.అనేకసార్లు అతను వరదలలో, అగ్ని ప్రమాదాలలో… ఎంతో మందిని కాపాడి ప్రాణభిక్ష పెట్టాడు.

అందుకు వారు ప్రతిఫలంగా అతనికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లారు.దాంతో తన భర్త డబ్బులు తీసుకోవడానికి అంగీకరించలేదు.

ఆ తర్వాత వారికి వీలైతే… నాకు గుండె సమస్య ఉందని, నేను ఎన్నిరోజులు బతుకుతానో నాకే తెలియదు.ఒకవేళ నేను మరణిస్తే తన భార్య, పిల్లలను మంచిగా చూసుకోవాలని చెప్పాడంట.

అందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీవారు ఆమెకు మంచి ఉద్యోగం ఇచ్చారు.అంతే కాదు ఆమె బతికినంత కాలం జీవించడానికి ఒక ఇంటిని కూడా ఆమెకు ఇచ్చారు.

అందుకే మనము ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటే మనకు కూడా అంతా మంచే జరుగుతుంది అనటంలో ఏమాత్రము సందేహము లేదు.జరిగే పని లో కొంచెం ఆలస్యం జరుగుతుంది అంతే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube