వైరల్ వీడియో: బంతితో తెగ అట్లాడుకుంటున్న తాబేలు, కుక్కపిల్ల…!  

how cute tortoise and dog playing football viral video tortoise, dog, viral video, social media, playing, foot ball - Telugu Dog, Foot Ball, Playing, Social Media, Tortoise, Viral Video

ఇది వరకు మనం తాబేలు-కుందేలు కు సంబంధించిన పరుగుపందెం కథ బాగానే విని ఉంటాం.అయితే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా శునకం, తాబేలు కథ చూడాల్సిందే మీరు.

TeluguStop.com - How Cute Tortoise And Dog Playing Football

ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో శునకం తాబేలు కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సంగతి విషయానికి వస్తే.

మామూలుగా తాబేలు ఎంత స్పీడ్ గా ప్రయాణం చేస్తుందో అందరికీ తెలిసిందే.అయితే ‘ మన బలం ఎక్కువ.

TeluguStop.com - వైరల్ వీడియో: బంతితో తెగ అట్లాడుకుంటున్న తాబేలు, కుక్కపిల్ల…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇతర సామర్థ్యాన్ని తక్కువ ‘ ఎప్పుడూ చేయకూడదన్న నీతిని ఎప్పుడో బోధించింది తాబేలు.

అయితే తాజాగా తాబేలు మాత్రం బంతితో తెగ హుషారుగా ఆడుతుంది అంటే మీరు నమ్ముతారా…? అవును మీరు నమ్మకపోయినా నమ్మాల్సిన విషయం ఇది.అయితే ఆ తాబేలు ఒకటే కాదండి దానికి తోడుగా ఓ శునకం కూడా జత కలిసింది.శునకం హుషారుగా పరిగెత్తే స్వభావం కలది… అయితే తాబేలు నిదానంగా నడిచే స్వభావం కలది.కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం కుక్కపిల్లతో కలిసి తాబేలు కూడా ఎంతో హుషారుగా బాల్ తో ఆడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందే.

43 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో కుక్కపిల్ల ఒకవైపు బంతిని కొడుతుంటే మరోవైపు తాబేలు ముందుకు వచ్చి దానిని నెట్టుతుంది.బాలు వేగంగా కదులుతున్న సమయంలో కూడా దానిని అందుకునేందుకు తాబేలు తెగ హుషారుగా పరిగెడుతుంది.ఇలా ఆడుతున్న సమయంలో కుక్క పిల్ల తాబేలు ఇంకా రావట్లేదా అని ఆలోచించి ఆ కుక్క పిల్ల తాబేలు దగ్గరికి వెళ్లి దానిని తీసుకువెళుతుంది.

ఇలాంటి జంతువులకు సంబంధించి గమ్మత్తయిన వీడియోని చూసి నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అతి తక్కువ సమయం లోనే బాగా పాపులర్ అయిపోయింది.

అయితే కుక్కపిల్ల, తాబేలు కలిసి బంతి ఆట ఆడడం నిజంగా ఆనందించదగ్గ విషయమే అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆ జంతువులకు బాల్ ఆట ఇలానే ఆడాలని ఎలా తెలుసో మరి.

#Foot Ball #Tortoise #Playing #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How Cute Tortoise And Dog Playing Football Related Telugu News,Photos/Pics,Images..