తెలంగాణాలో అత్యుత్తమంగా జీవించేందుకు వినియోగదారుల ఎంపికలను కంట్రీ డిలైట్‌ ఏ విధంగా మారుస్తోంది ?

భారతదేశపు తాజా ఆహారం మరియు ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్‌ 2025 నాటికి 50 బిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని అంచనా.నేడు, దాదాపు 60%కు పైగా ఫ్రెష్‌ ఫుడ్‌ మార్కెట్‌ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో, సరైన రవాణా సదుపాయాలు మరియు తగినంత విజిబిలిటీ , సరఫరా చైన్‌ లేకుండా లభిస్తున్నాయి.

 How Country Delight Is Changing The Consumer Choices In Telangana To Live Better-TeluguStop.com

కంట్రీ డిలైట్‌ తమ ‘నాణ్యత ముందు’ డీఎన్‌ఏ మరియు సాంకేతికాధారిత సరఫరా చైన్‌ ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

సాంకేతికాధారిత డైరెక్ట్‌ టు హోమ్‌ కన్స్యూమర్‌ బ్రాండ్‌ కంట్రీ డిలైట్‌.

వినియోగదారుల జీవితాలను మెరుగుపరిచే ఉత్పత్తులను అందించేందుకు ఇది సహాయపడుతుంది.కంట్రీ డిలైట్‌ ఉత్పత్తి డీఎన్‌ఏలో అత్యంత కీలకంగా నేచురల్‌ వెల్‌నెస్‌ ఉంటుంది.

మేము సరఫరా చేసే ప్రతి ఉత్పత్తీ సహజసిద్ధమైనది.స్వచ్ఛమైనది (మధ్యవర్తులు లేరు), తాజాగా ఉంటుంది (పూర్తి సొంతమైన సరఫరా చైన్‌) మరియు కనీస ప్రాసెస్‌ చేయబడింది (వీలైనంత వరకూ ఇంటిలో తయారుచేసిన రీతిలో ఉంటాయి).

కంట్రీ డిలైట్‌ ఇప్పుడు నెలకు 8 మిలియన్‌ డెలివరీలను 15 నగరాలలో చేస్తుంది.దీని సరఫరా చైన్‌ భారతదేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

ప్యాకేజ్డ్‌ మరియు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మన జీవితాలలో అంతర్భాగంగా మారాయి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2012 తరువాత ఆహార పదార్థాల కల్తీ రెట్టింపు కావడంతో పాటుగా 28%పైగా ఫుడ్‌ శాంపిల్స్‌ కల్తీ చేయబడ్డాయని గుర్తించింది.

ఈ కల్తీని నిరోధించేందుకు సాంకేతికాధారిత, వినియోగదారుల లక్ష్యిత విధానాన్ని కంట్రీడిలైట్‌ అనుసరిస్తుంది.భారతదేశంలో సుప్రసిద్ధ డీ2సీ ఫ్రెష్‌ ఫుడ్‌ ఎసెన్షియల్స్‌ బ్రాండ్‌గా ఇది నిలువడంతో పాటుగా పాలు, పండ్లు, కూరగాయలను వినియోగదారుల ఇంటి ముంగిటనే అందిస్తుంది.

ఈ కంపెనీ యొక్క వ్యాపార నమూనా కారణంగా తాజా డెలివరీలను 24–36 గంటల లోపే పొందవచ్చు.

‘‘ప్రారంభం నుంచి కూడా సరఫరా పరంగా కంట్రీడిలైట్‌ , అతి తక్కువ వాటాదారులతో కలిసి పనిచేయాలనే సిద్ధాంతం అనుసరిస్తుంది.

ఇక్కడ మీరు అత్యధిక పరిమాణంలో క్వాంటిటీలను పొందడంతో పాటుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులనూ పొందవచ్చు.ఇది రెండు లేదా మూడు ఫార్మాట్‌లలో వస్తుంది’’ అని కంట్రీడిలైట్‌ కో–ఫౌండర్‌ చక్రధర్‌ గాదె అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube