వామ్మో.. ఈ వీఆర్వో ఎంత తెలివిగా 2320 ఎక‌రాల‌ను కొట్టేశాడో..

రెవెన్యూ వ్య‌వ‌స్థ అంటేనే ప్ర‌జ‌ల్లో చాలా వ్య‌తిరేక‌త ఉంది.ఎందుకంటే భూముల విష‌యంలో వారు చాలా గోల్ మాల్ చేస్తార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి.

 Ho My God.. How Cleverly This Vro Hit 2320 Acres . Land Scham, Crime News, Anra-TeluguStop.com

ఇప్ప‌టికే ఎంతోమంది రెవెన్యూ ఆఫీస‌ర్లు సాగించిన భూ అక్ర‌మాల‌ను మ‌నం చూశాం.కానీ ఇప్పుడు అంత‌కు మించిన భూ స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం.

అయితే ఇంత పెద్ద స్కామ్ చేసింది ఎవ‌రో పెద్ద ఆఫీస‌ర్ అనుకుంటే పొర‌పాటు ఒక వీఆర్వే.ఆయ‌న ప్రభుత్వానికి చెందిన భూమిని ఏకంగా 2320 ఎకరాల‌ను గోల్ మాల్ చేసేశారు.

ఈ భూమిని మొత్తం త‌న పిల్ల‌ల‌కు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేసేశారు.

చిత్తూరు జిల్లాలో ఆయ‌న రీసెంట్ గా ఒకేరోజు 1,577 ఎకరాలను ఆన్‌లైన్‌లో న‌మోదు చేయ‌డంతో అంతా షాక్ అయిపోయారు.ఈ భూమి విలువ దాదాపుగా రూ.500 కోట్ల దాకా ఉంటుంద‌ని చెబుతున్నారు.దీంతో ఈ ఉదంతం ఇప్పుడు ఏపీలో ప్ర‌క‌పంన‌లు రేపుతోంది.ఇదే జిల్లాలో నివ‌సం ఉండే మోహన్ గణేశ్ పిళ్లై గ‌తంలో వీఆర్వోగా పని చేసిన క్ర‌మంలోనే ఈ భూమికి ఎన్నో ర‌కాల న‌కిలీ ప‌త్రాలు సృష్టించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఆయ‌న 2010లో రిటైర్ అయిపోయారు.ఇక జిల్లాలోని ప‌లు వ‌రుస గ్రామాల్లో అటవీ భూముల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌భుత్వ భూమి అయిన 2320 ఎకరాలను ఆయ‌న కొట్టేసేందుకు ప్లాన్ వేశారు.

Telugu Anra Pradesh, Chittoru, Scham-Latest News - Telugu

ఈ భూమి మొత్తం తన తండ్రికి త‌మ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింద‌ని, కాబ‌ట్టి అది త‌మ‌కే ద‌క్కుతుందంటూ కొన్ని న‌కిలీ పత్రాల్ని క్రియేట్ చేసేశాడు.ఇదంతా ఆయ‌న వీఆర్వోగా ప‌నిచేస‌నిప్పుడే ఈ అరాచ‌కాల‌ను చేశాడు.ఇక ఆ భూమిని త‌న అమ్మ‌, కొడుకుల పేరుమీద గ‌తంలోనే ఆన్‌లైన్‌లో న‌మోదు చేయించి అందులో కొంత భూమిని ప‌దిమందికి అమ్మేశాడు.అయితే ఇందులో ఒక‌రు 160 ఎకరాలకు ప‌ట్టా కావాలంటూ దరణి దరఖాస్తు చేసుకోగా ఇందులోని లోతుల‌ను గ‌మ‌నించిన త‌హ‌సీల్దార్ విచార‌ణ‌కు ఆదేశించి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఇక వారు 2020 మే నెల నుంచి విచార‌ణ జ‌రుపుతుండ‌గా ఇప్పుడు ఈ భూ దందా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube